కరోనా బారినపడ్డ హీరోహీరోయిన్‌.. సినీ ఇండస్ట్రీ షాక్! ఆసుపత్రిలో చేర్చగానే..

ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ సినీ ఇండస్ట్రీని కూడా తాకింది. హాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ హీరో, హీరోయిన్ కరోనా బారిన పడటంతో ఒక్కసారిగా షాకయ్యాయి హాలీవుడ్ సినీ వర్గాలు. ఇంతకీ ఆ హీరో హీరోయిన్ ఎవరు? అసలు మ్యాటర్ ఏంటి? వివరాల్లోకి పోతే..

కరోనా ఎఫెక్ట్.. వణికిపోతున్న జనం

కరోనా ఎఫెక్ట్.. వణికిపోతున్న జనం

చైనా దేశం వూహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. చాలా దేశాల్లో కరోనా వైరస్ బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతుండటంతో జనం వణికిపోతున్నారు. మరోవైపు కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అన్నిదేశాల ప్రభుత్వాలు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టాయి.

అన్నిరంగాలపై ప్రభావం.. మార్కెట్లు విల విల

అన్నిరంగాలపై ప్రభావం.. మార్కెట్లు విల విల

ఇప్పటికే వేలాది మందిని బలి తీసుకున్న కరోనా వైరస్ దేశవిదేశాల్లోని మార్కెట్లను దెబ్బతీస్తూ అన్నిరంగాలపై ప్రభావం చూపుతోంది. భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య 68కి చేరింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే లక్షా 25 వేల మందికి పైగా ఈ వైరస్ సోకిందని రిపోర్ట్స్ చెబుతున్నాయి.

సినిమా షూటింగ్స్ వాయిదా.. థియేటర్స్ క్లోజ్

సినిమా షూటింగ్స్ వాయిదా.. థియేటర్స్ క్లోజ్

కరోనా కారణంగా పలు హాలీవుడ్ సినిమాల షూటింగ్స్ ఇప్పటికే వాయిదా వేశారు. చైనా దేశంలో ఉన్న వేలాది థియేటర్స్ మూసేశారు. రద్దీ ప్రదేశాలకు జనం వెళ్లకూడదని పలు దేశాల ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి కూడా. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటుండగానే హాలీవుడ్ హీరో, హీరోయిన్ కరోనా బారిన పడటం సినీ ఇండస్ట్రీని షాక్‌కి గురిచేసింది.

హాలీవుడ్ దంపతులు.. కరోనా బారిన హీరోహీరోయిన్

హాలీవుడ్ దంపతులు.. కరోనా బారిన హీరోహీరోయిన్

హాలీవుడ్ దంపతులు టామ్ హంక్స్, అతని భార్య రీటా విల్సన్‌‌లకు కరోనా వైరస్ సోకింది. కొన్ని రోజులుగా జలుబు, ఒళ్లు నొప్పులు, జ్వరంతో ఇబ్బంది పడుతున్న వారు.. ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోగా వారికి కరోనా వైరస్ సోకిందని తెలిసింది. ప్రస్తుతం వీరికి చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Recommended Video

Vishwaksen Hungama At Sandhya 70mm | Hit Movie Public Talk | Filmibeat Telugu
ఇండియాలో కరోనా ఎఫెక్ట్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

ఇండియాలో కరోనా ఎఫెక్ట్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

మరోవైపు భారత దేశంలోనూ కరోనా ప్రబలుతుండటంపై అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ఇప్పటికే జనం ఎక్కువగా గుమిగూడే ప్రదేశాలపై ఆంక్షలు విధించింది కేరళ గవర్నమెంట్. ఇందులో భాగంగా థియేటర్స్ క్లోజ్ చేయాలని ఆదేశించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X