twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరోనా దెబ్బకు హలీవుడ్‌ విలవిల.. తోకముడిచిన జేమ్స్‌బాండ్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్

    |

    ప్రపంచ సినిమాపై కరోనా వైరస్ ప్రభావం భారీగానే పడతున్నది. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన సినిమాలు వాయిదా పడ్డాయి. అలాగే జరగాల్సిన షూటింగ్స్ వాయిదా పడి బడ్జెట్ పరంగా భారంగా మారబోతున్నాయి. వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందిన హాలీవుడ్ చిత్రాల రిలీజ్ వాయిదా పడటం ఆందోళనకరంగా మారింది. యూనివర్సల్ స్టూడియో రూపొందించిన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ ఎఫ్9 చిత్రం ఎప్రిల్ విడుదల కావాల్సింది. అయితే కరోనా పరిస్థితుల కారణంగా దాని విడుదల మే 2020కి వాయిదా పడింది.

    అలాగే ఎంజీఎం సంస్థ రూపొందించిన జేమ్స్ బాండ్ మూవీ నో టైమ్ టు డై సినిమా కూడా వాయిదా పడటం అభిమానులకు నిరాశను కలిగిస్తున్నది. కరోనా పరిస్థితుల కారణంగా ఈ సినిమాను దాదాపు ఏడు నెలలు వాయిదా వేయడం తెలిసిందే. ఈ సినిమాను నవంబర్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మార్వెల్ కథా చిత్రం బ్లాక్ విండ్ కూడా వాయిదా పడింది. ఈ చిత్రం మేలో విడుదల కావాల్సి ఉండగా, నిరవధికంగా వాయిదా వేశారు.

    Coronavirus effect on hollywood: NoTime to Die, F9, postponed

    సినిమా రిలీజ్ విషయం పక్కన పెడితే.. పలు షూటింగులు కూడా వాయిదా పడ్డాయి. డిస్నీ రూపొందించే ది లిటిల్ మెర్మాయిడ్, పీటర్ ప్యాన్, హోం ఎలోన్, యూనివర్సల్ సంస్థ రూపొందించే జురాసిక్ వరల్డ్ సినిమాల షూటింగ్ నిరవధికంగా వాయిదా పడ్డాయి.

    ప్రస్తుతం అమెరికాలో కరోనావైరస్ కారణంగా పరిస్థితులు దారుణంగా మారాయి. ఎటు చూసినా శ్మశాన వైరాగ్యమే కనిపిస్తున్నది. సినిమా రంగంతోపాటు పలు రంగాల కుదేలయ్యాయి. ఇప్పట్లో అమెరికా కోలుకొనే పరిస్థితి కనిపించడం లేదు. కరోనా ప్రభావం కేవలం అమెరికాపైనే కాదు.. బాలీవుడ్, టాలీవుడ్ రంగాలపై కూడా భారీగా ప్రభావితం చూసే అవకాశాలు భారీగా ఉన్నాయి.

    English summary
    Some of the more high-profile releases which have been postponed include Universal's F9, the latest in its Fast and Furious franchise, which will now open in April 2021 instead of May 2020, and MGM's latest James Bond movie, NoTime to Die, which has been pushed back by seven months to November.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X