twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరోనా కాటుకు ప్రముఖ గాయకుడు మృతి.. విషాదంలో సంగీతలోకం

    |

    అమెరికాలో జానపద గేయాలతో సంగీత ప్రియులను ఉర్రూతలూగించిన జో డిఫ్పి ఇకలేరు. కొద్ది రోజుల క్రితం కొవిడ్-19 పాజిటివ్ అని తేలిన ఆయన చికిత్స పొందుతూ మరణించారు. ఆయన వయసు 61 సంవత్సరాలు. ఆయన మృతి జానపద సంగీతంలో ఓ ఘట్టం ముగిసిందని అమెరికా సంగీత నిపుణులు తమ సంతాప ప్రకటనలో తెలిపారు. వివరాల్లోకి వెళితే..

    చికిత్స పొందుతూ తిరిగి రాని లోకాలకు

    చికిత్స పొందుతూ తిరిగి రాని లోకాలకు

    కొద్దిరోజుల క్రితం డిఫ్ఫికి కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. కంట్రీ సింగర్స్‌లో కరోనా బారిన పడిన తొలి గాయకుడని కథనాలు వెల్లడయ్యాయి. అయితే చికిత్స పొందుతున్న ఆయన కోలుకుంటారని ఆశించిన సన్నిహితులకు తీరని విషాదాన్ని మిగిల్చాడు. ఆదివారం టెన్నెస్సీలోని నాష్‌విల్లేలో జో డిఫ్పి మరణించారు అని సన్నిహితులు తెలిపారు.

    విశేష ప్రజాదరణతో

    విశేష ప్రజాదరణతో

    డిఫ్పి ఓక్లహామాలోని తుల్సా నివాసి. గత 25 ఏళ్లుగా గ్రాండ్ ఓలే ఓప్రే అనే మ్యూజిక్ సంస్థలో సభ్యుడిగా కనసాగుతున్నారు. హంకీ టాంక్ యాటిట్యూడ్, ప్రాప్ మీ అప్ బిసైడ్ ది జ్యూక్ బాక్స్ (ఇఫ్ ఐ డై), బిగ్గర్ ద్యాన్ ది బీటిల్స్, ఇఫ్ ది డెవిల్ డ్యాన్డ్స్ అనే ఆల్బమ్స్ విశేష ప్రేక్షకాదరణ పొందాయి.

    గ్రామీ అవార్డు విజేతగా

    గ్రామీ అవార్డు విజేతగా

    జో డిఫ్పి రూపొందించిన సేమ్ ఓల్డ్ ట్రైన్ గ్రామీ అవార్డుల్లో ఉత్తమ గౌరవం దక్కింది. బెస్ట్ కంట్రీ కొలాబ్రేషన్స్ అనే కేటగిరిలో తన సహచర సంగీత దర్శకుడు మెర్లే హగ్గర్డ్, మార్టీ స్టువార్ట్ ఇతరులతో కలిసి గ్రామీ అవార్డును పంచుకొన్నారు. 2010లో చివరిసారిగా హోమ్ కమింగ్ అనే ఆల్బమ్ సోలోగా రూపొందించారు.

    విషాదంలో సంగీత లోకం

    ది లెజెండరీ జో డిఫ్పీ ఆర్టిస్టులకే ఆర్టిస్టు. హాంకీ టాంక్ 101 ఆల్బమ్ అత్యుత్తమ బిజినెస్ చేసింది. అతడికంటే గొప్పగా ఎవరూ పాడలేదు. ఇతర గాయకులు గొప్పగా చూసుకొన్న జో డిఫ్పిని మించిన వాడు ఇక భూమ్మీద పుట్టరు. గొప్ప సంగీతకారుడిని కోల్పోయాం అని జాన్ రిచ్ అనే సంగీతకారుడు ట్వీట్ చేశారు. కంట్రీ మ్యూజిక్ గొప్ప సంగీతకారుడిని కోల్పోయింది అని నోమీ జుడ్ పేర్కొన్నారు.

    English summary
    Country singer Joe Diffie died with Corona. Diffie's publicist Scott Adkins said the singer died Sunday in Nashville, Tennessee, due to complications from the virus.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X