twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వంద మిలియన్ డాలర్ల మార్కు చేరిన ఎ.ఆర్.రెహమాన్ చిత్రం

    By Kuladeep
    |

    భారతీయ సంగీత దర్శకుడు, 'స్లమ్ డాగ్ మిలియనీర్' చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా ఆస్కార్ అవార్డు పొందిన ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించిన పూర్తి స్థాయి హాలీవుడ్ చిత్రం 'కపుల్ రీ-ట్రీట్' సినిమా ఉత్తర అమెరికా బాక్సాఫీసు రిపోర్ట్ ప్రకారం వంద మిలియన్ డాలర్లను వసూలు చేసింది. పీటర్ బిల్లింగ్ స్లే దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అక్టోబరు 8న ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ లో విడుదల కాగా, అక్టోబరు 9న అమెరికాలో విడుదలయింది. బాక్సాఫీస్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా మొత్తం 102 మిలియన్ డాలర్లను వసూలు చేసింది.

    113 నిమిషాల నిడివి గల ఈ సినిమా కథ ట్రాపికల్-ఐస్ ల్యాండ్ కు వెళ్లిన నాలుగు జంటల మధ్య తిరుగుతుంది. ఇంకా ఈ సినిమా చాలా దేశాల్లో విడుదల కావాల్సివుంది. భారతదేశంలో కూడా ఈ సినిమా ఇంకా విడుదల కావాల్సివుంది. పెళ్లిళ్ల మధ్య తిరిగే కథ కావడంతో ఇక్కడ ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుందని ఇండో-అమెరికా సినీ విశ్లేషకుడు రాజన్ జెడ్ అభిప్రాయపడ్డాడు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X