నెంబర్ వన్ స్దానం కోసం పోటీపడుతున్న స్టార్ హీరోలు
ఇటీవల హాలీవుడ్లో విడుదలై బాక్సాఫీసు రికార్డుల్ని నమోదు చేస్తున్న కౌబాయ్స్ అండ్ అలైన్స్, స్ముర్ఫ్స్ అనే రెండు సినిమాలు వీకెండ్ కలెక్షన్స్‌తో నెంబర్ వన్ స్దానం కోసం పోటీ పడుతున్నాయి. డేనియల్ గ్రెగ్, హారిసన్ ఫోర్డ్ హీరోలుగా నటించిన సైన్స్ ఫిక్షన్ సినిమా కౌబాయ్స్ అండ్ అలైన్స్. యానిమేటెడ్ ఫ్యామిలీ ఎడ్వంచర్ కధాంశంతో రూపోందించిన స్ముర్ఫ్స్ రెండూ వారంతంలో $36.2 మిలియన్ వసూలు చేయడం జరిగింది.
స్ముర్ఫ్స్ యానిమేటెడ్ సినిమాని సోనీ ఎంటర్టెన్మెంట్ వారు నిర్నించడం జరిగింది. అదేవిధంగా కౌబాయ్స్ అండ్ అలైన్స్ సినిమాని యూనివర్సిల్ స్టూడియో వారు రూపోందిచండం జరిగింది. సాధారణంగా వారంతంలో వచ్చినటువంటి కలెక్షన్స్ సోమవారం ఉదయం నాటికి గాను లెక్కింపు జరపడం జరుగుతుంది. గత వారం టాప్ స్దానంలో నిలిచినటువంటి కెప్టెన్ అమెరికా: ద ఫస్ట్ అవెంజర్ $24.9 మిలియన్లతో మూడవ స్దానంలో నిలిచింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా అట్టహాసంగా విడుదలైన హ్యారీ పోట్టర్ అండ్ ద డెత్లీ హ్యాలోస్ పార్ట్ 2 సినిమా పోయిన వారం $21.9 మిలియన్లు రాగా, మొత్తం సినిమా విడుదలైన రోజు నుండి ఇప్పటివరకు $318.5 మిలియన్లు సంపాదించి టాప్ గ్రాసింగ్ మూవీగా ఆల్ టైమ్ రికార్డుని నమోదు చేసింది.


Click it and Unblock the Notifications











