డేనియల్ గ్రెగ్ 23వ బాండ్ సినిమా లేటెస్ట్ న్యూస్
జేమ్స్ బాండ్ సినిమాలంటే అందరికీ ఆసక్తే. అందుకు కారణం అమెరికన్ గూఢాచారిగా జేమ్స్ బాండ్ చేసేటటువంటి సాహాసాలు, విన్యాసాలు చూడముచ్చటగా ఉంటాయి కాబట్టి. ప్రస్తుతం హాలీవు్డ్లో జేమ్స్ బాండ్‌గా డేనియల్ గ్రేగ్ హీరోగా 23వ జేమ్స్ బాండ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంతవరకు ఈ సినిమా గురించి ఎటువంటి సమాచారం బయటకు రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు నిర్మాతలు. కానీ ఈ రోజు సినిమా టైటిల్ గురించిన సమాచారం ఇంటర్నెట్లో సంచరిస్తుంది.
ఏంటీ ఆ కొత్త సమాచారం అని అనుకుంటున్నారా.. జేమ్స్ సినిమాలలో ఎవరు నటించాలి, అనే దానికంటే కూడా ఆ సినిమాకి ఏ పేరు పెట్టాలనేది ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు నిర్మాతలు, డైరెక్టర్. అలాంటి 23వ జేమ్స్ బాండ్ సినిమాకి 'స్కైఫాల్' అని నామకరణం చేసినట్లు సమాచారం. ఈ పేరుని జైమ్స్ బాండ్ పేరు ప్రక్కన ఉన్న డొమైన్ ఆధారంగా తెలుపడం జరుగుతుంది. హాలీవుడ్ షూటింగ్‌కి ముందు సినిమా పేరు రిజస్టర్ చేసుకొవడం ఆనవాయితి. ఈ సినిమాకి మాత్రం జేమ్స్ బాండ్ స్కైఫాల్. కామ్, స్కైఫాల్ ద ఫిల్మ్.కామ్ అంటూ రెండు పేర్లుని రిజస్టర్ చేయించినట్లు సమాచారం.
ఇకపోతే ఈ సినిమాని ఎమ్‌జిఎమ్, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈసినిమాని ఆస్కార్ అవార్డ్ విన్నర్, టైటానిక్ హీరోయిన్ కేట్ విన్స్ లెట్ మాజీ భర్త శ్యామ్ మెండిస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో జేమ్స్ బాండ్ గర్ల్స్‌గా హెలెన్ మేక్కోరీ, ప్రెంచ్ బ్యూటీ బెరనైస్ మార్లోహీ నటిస్తున్నారు. విలన్‌గా ఆస్కార్ విన్నర్ జేవియర్ బార్డిమ్ నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











