Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వారిద్దరూ విడాకులు తీసుకోవడం బాధాకరం: జెన్నిఫర్ లోపెజ్
లాస్ ఏంజిల్స్, జులై 13: హాలీవుడ్ పాప్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్ ఇటీవల విడాకులు తీసుకున్న టామ్ క్రూయిజ్ - క్యాటీ హాల్మస్ల గురించి తెలిసి చాలా బాధపడ్డారు. విడాకుల సెటిల్మెంట్లో ఓ ఒక్కరూ గెలిచినట్లు కాదని తన పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. వివరాల్లోకి వెళితే ఐదు సంవత్సరాలు కలిసి జీవించి కొన్ని మనస్పర్దల కారణంగా టామ్ - హాల్మస్ విడాకులు తీసుకున్నారని తెలిసింది. ఆ సమయంలో నేను దక్షిణ అమెరికాలో ఉన్నాను. నిజంగా ఈ వార్త నా మనసుని కలచివేసింది.
టామ్ - హాల్మస్ ఇద్దరూ చూడచక్కని జంట. మంచి కపుల్. గత యేడాది నేను, నా భర్త మార్క్ ఆంటోనీ విడాకులు తీసుకున్నట్లు వీరు కూడా విడాకులు తీసుకున్నారని చెప్పింది. విడాకుల తీసుకోవాలని ఎవరూ భావించరు. ఒకసారి విడాకులు తీసుకునే మందు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తే మీకంటే అదృష్టవంతులు ఎవరూ ఉండరని అంది. కానీ కొన్ని సందర్బాలలో క్షణికావేశంలో కొన్ని నిర్ణయాలను తీసుకోని, వాటికి కట్టుబడి ఉండాల్సి వస్తుందని వాపోయింది.
టామ్ క్రూయిజ్ - క్యాటీ హాల్మస్ల మద్దుల కూతరు సూరి క్రూయిజ్‌ని తన తల్లి క్యాటీ హాల్మస్కే అప్పగించి.. తండ్రి టామ్ క్రూయిజ్ వారం వారం తన కూతురిని కలిసి అవకాశం కల్పించారని విన్నాను. 42 సంవత్సరాల వయసు కలిగిన జెన్నిఫర్ లోపెజ్ మాట్లాడుతూ కనీసం వారి కూతురు కోసమైనా వీరిద్దరూ మళ్లీ కలిస్తే బాగుంటుందని భావిస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ.. వారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను.
వారిద్దరి నిర్ణయంలో శాంతి ఉంది. టామ్ తన ముద్దుల కూతురు సూరి విషయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడు. కేవలం వీరిద్దరే కాదు టామ్ క్రూయిజ్ గతంలో దత్తతు తీసుకున్న ఇసాబెల్లా జానే, కానర్ అందరూ ఒక కుటుంబం లాగా కలిసి మెలిసి జీవించారని కొన్ని సంఘటలను గుర్తు చేసుకున్నారు. చివరగా నేను ఒక్కటి చెప్పదలచుకున్నాను. ఇద్దరు వ్యక్తులు విడాకుల పేరుతో విడిపోయినప్పడు.. వారిద్దరిలో ఏ ఒక్కరూ గెలిచినట్లు కాదు.. వారిద్దరి హృదయం పగిలినట్లేనని అన్నారు.
2006వ సంవత్సరంలో క్యాట్ హాల్మస్ను టామ్ క్రూయిజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. క్యాట్ హాల్మస్‌కు ఇదే మొదటి వివాహం కాగా, టామ్ క్రూయజి్కు మూడవ వివాహం. టామా క్రూయిజ్ గతంలో హాలీవుడ్ స్టార్ హీరోయిన్లు మిమి రోజెర్స్, నికోల్ కిడ్మన్లను వివాహం చేసుకున్నాడు. నికోల్ కిడ్ మన్లతో కలిసి ఉన్నప్పుడు టామ్ క్రూయిజ్ ఇసాబెల్లా జానే, కానర్ ఆంటోనీ ఇద్దరు పిల్లలను దత్తతు తీసుకున్నాడు. దీంతో టామ్ క్రూయిజ్‌కు మొత్తం ముగ్గురు పిల్లలు.
తెలుగు వన్ఇండియా