సూపర్ స్టార్ సర్‌ప్రైజ్, యూనిట్ మొత్తానికి వారానికో కొత్త ట్రీట్
లాస్ ఏంజిల్స్, జూన్ 4: 'మిషన్ ఇంపాజబుల్' సినిమాల సిరిస్ ద్వారా హాలీవుడ్ సూపర్ స్టార్ రేంజికి ఎదిగిన హీరో 'టామ్ క్రూయిజ్'. టామ్ క్రూయిజ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా "రాక్ ఆఫ్ ఏజెస్". ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సినిమా సిబ్బందిని టామ్ క్రూయిజ్ వారం వారం కొత్త బహుమతులను అందిస్తూ ఆశ్చర్యంలో ముంచెత్తిస్తున్నాడు. ఈ సినిమాలో తనతో పాటు నటిస్తున్న హీరోయిన్ జులియన్నే హాగ్ మాట్లాడుతూ టామ్ తన భార్య కేటీ మోమ్స్ గురించి ఆలోచించడానికి సమయం లేకుండా తన "రాక్ ఆఫ్ ఏజెస్" సిబ్బందితో ఎక్కువ సమయం గడుపుతున్నాడని తెలిపింది.
టామ్ ఎల్లప్పుడూ చాలా కూల్‌గా ఉంటాడు. సూపర్ స్టార్ ఉండాల్సిన లక్షణాలన్నీ కూడా తనలో ఉన్నాయి. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనే భావనతో కనిపిస్తాడు. తన చుట్టూ తన మొత్తం బృందం ఉన్నప్పటికీ... సూపర్ ఓ స్టార్ మాదిరి ఏనాడు ప్రవర్తన ఉండదని చెప్పింది. టామ్ క్రూయిజ్ తన భార్య్ కేటీ మోమ్స్ అందరం కలిసి డిన్నర్ కూడా వెళ్లామని తెలిపింది. టామ్ ఎల్లప్పుడూ సిబ్బందితో ప్రవర్తించే తీరు అందరిని ఆలోచింపజేసేలా ఉంటుంది.
అందరికి నోట్స్ పంపించడం.. టామ్ నుండి సినిమా క్రూ మొత్తానికి ట్రీట్స్ అందుతాయి. ఆ ట్రీట్స్ ఎలా ఉంటాయంటే చాక్ లెట్స్, స్ట్రా బెర్రీస్, గ్రీస్ శాండ్ విచ్ ట్రక్ లాంటి వాటితో సడన్‌గా అందరికి ట్రీట్ ఇచ్చి సర్ ప్రైజ్ చేస్తాడు. ఇక "రాక్ ఆఫ్ ఏజెస్" సినిమాకు ఆడమ్ ష్యాంక్ మ్యాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. "రాక్ ఆఫ్ ఏజెస్" సినిమాలో టామ్ క్రూయిజ్ పాటు బ్రిటిష్ కమెడియన్ రస్సెల్ బ్రాండ్, కేథరీన్ జీటా జోన్స్, డియిగో బోనెటా తదితరులు నటిస్తున్నారు.
టామ్ క్రూయిజ్, క్యాటీ హాల్మస్‌ల గారాల ముద్దు బిడ్డ సూరి క్రూయిజ్. ఇటీవల ఇన్ స్టయిల్ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్యూలో క్యాటీ హాల్మస్ మాట్లాడుతూ సూరి క్రూయిజ్ మంచి అద్లెట్, సింగర్, డాన్సర్. నాకు తెలిసి రాబోయే రోజుల్లో హాలీవుడ్‌కి ఓ మంచి హీరోయిన్ అయ్యే అవకాశాలు సూరి క్రూయిజ్‌కి ఉన్నాయని తన ఐదు సంవత్సరాలు కూతురు గురించి చాలా గొప్పగా వెల్లడించింది.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











