ఆ సినిమాలో ఆమె విలనా??
హాలీవుడ్ స్టార్ హీరో, 'మిషన్ ఇంపాజబుల్' హీరో టామ్ క్రూజ్ ప్రధాన పాత్రలో రూపొందబోయే తర్వాతి మిషన్ ఇంపాజబుల్ సీక్వెన్స్ లో ఆయన భార్య, హాలీవుడ్ సెక్సీ నాయిక క్యాటీ హాల్మస్ ప్రతినాయికగా నటించనుందని విశ్వసనీయ సమాచారం. ఈ సమాచారం ప్రకారం టామ్ క్రూజ్ కు ఎంతో పేరు తెచ్చిపెట్టిన 'మిషన్ ఇంపాజబుల్' సినిమా తాజా సీక్వెల్ లో టామ్ తన సహచరిణి క్యాటీతో రొమాన్స్ చెయ్యడానికి సిద్ధంగా లేడట. దీంతో ఆమెను ప్రతినాయికగా నటింపజేయనున్నట్టు తెలిసింది.
ఇంతకు మునుపు వీరు నాయికా-నాయకులుగా నటించిన విషయం తెలిసిందే. దీంతో నాయక-ప్రతినాయికలుగా వీరిద్దరూ ఎలా వుండబోతున్నారా అనే ఆసక్తి అందరిలోనూ వ్యక్తమవుతోంది. క్యాటీ కూడా తన మూడేళ్ల పాప సూరీ చూసుకుంటూనే సినిమాల్లో నటించడానికి సిద్ధంగా వున్నానని ప్రకటించింది.
టామ్ క్రూజ్ క్యాటీ హాల్మస్ హాలీవుడ్ మిషన్ ఇంపాజబుల్ విలన్ tom cruise katie holmes hollywood mission impossible villian


Click it and Unblock the Notifications