ఈ సినిమా షూటింగ్‌లో నవ్వులే నవ్వులు..
జేమ్స్ బాండ్ హీరో డేనియల్ గ్రెగ్ ఇటీవల ఓ ప్రముఖ ఇంటర్యూలో మాట్లాడుతూ ప్రస్తుతం తాను నటిస్తున్న 'ద గర్ల్ విత్ ద డ్రాగెన్ టాటూ' సినిమా చాలా సిరియస్ ఫిల్మ్ అని అన్నారు. ఈ సినిమాలో షూటింగ్ సింహా భాగం చాలా వరకు పూర్తి కావచ్చిందని తెలిపారు. ఈ సినిమా షూటింగ్ చాలా సరదాగా ఫన్నీగా సాగుతుందని అన్నారు.
సినిమా కధ విషయానికి వస్తే హీరో చాలా సీరియస్‌గా అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేస్తాడు. దర్శకుడు డేవిడ్ దర్శకత్వం గురించి మాట్లాడుతూ అతని దర్శకత్వంలో నటించడం నిజంగా ఓ అనుభూతిని పొందినట్లు ఉందని అన్నారు. ఇంకా చెప్పాలంటే షూటింగ్‌లో ఏ సన్నివేశంలో నవ్వు వస్తుందో, ఏ సన్నివేశంలో సీరియస్‌గా ఉంటామో మాకే అర్దం కావడం లేదని అన్నారు.
హాలీవు్డ్లో జేమ్స్ బాండ్‌గా డేనియల్ గ్రేగ్ హీరోగా 23వ జేమ్స్ బాండ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంతవరకు ఈ సినిమా గురించి ఎటువంటి సమాచారం బయటకు రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు నిర్మాతలు. ఏంటీ ఆ కొత్త సమాచారం అని అనుకుంటున్నారా.. జేమ్స్ సినిమాలలో ఎవరు నటించాలి, అనే దానికంటే కూడా ఆ సినిమాకి ఏ పేరు పెట్టాలనేది ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు నిర్మాతలు, డైరెక్టర్.
అలాంటి 23వ జేమ్స్ బాండ్ సినిమాకి 'స్కైఫాల్' అని నామకరణం చేసినట్లు సమాచారం. ఈ పేరుని జైమ్స్ బాండ్ పేరు ప్రక్కన ఉన్న డొమైన్ ఆధారంగా తెలుపడం జరుగుతుంది. హాలీవుడ్ షూటింగ్‌కి ముందు సినిమా పేరు రిజస్టర్ చేసుకొవడం ఆనవాయితి. ఈ సినిమాకి మాత్రం జేమ్స్ బాండ్ స్కైఫాల్. కామ్, స్కైఫాల్ ద ఫిల్మ్.కామ్ అంటూ రెండు పేర్లుని రిజస్టర్ చేయించినట్లు సమాచారం.
ఇకపోతే ఈ సినిమాని ఎమ్‌జిఎమ్, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈసినిమాని ఆస్కార్ అవార్డ్ విన్నర్, టైటానిక్ హీరోయిన్ కేట్ విన్స్ లెట్ మాజీ భర్త శ్యామ్ మెండిస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో జేమ్స్ బాండ్ గర్ల్స్‌గా హెలెన్ మేక్కోరీ, ప్రెంచ్ బ్యూటీ బెరనైస్ మార్లోహీ నటిస్తున్నారు. విలన్‌గా ఆస్కార్ విన్నర్ జేవియర్ బార్డిమ్ నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











