twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బెస్ట్ జేమ్స్ బాండ్‌ అంటూ డేనియేల్ గ్రెగ్‌కి రోజర్ మూర్ నుండి కితాబు

    By Nageswara Rao
    |

    లండన్: ప్రపంచ వ్యాప్తంగా జేమ్స్ బాండ్ సినిమాలకున్న క్రేజీ అంతా ఇంతా కాదు. ఇప్పటి వరకు జేమ్స్ బాండ్ పాత్రలను తొమ్మిది మంది పోషించినప్పటికీ.. అందరిలోనూ జేమ్స్ బాండ్ పాత్రకు ఖచ్చితంగా అతికినట్లు సరిపోయన వ్యక్తి మాత్రం డేనియేల్ గ్రెగ్. ఈ మాట అన్నది ఎవరో కాదు 1973 నుండి 1985 వరకు అత్యధిక జేమ్స్ బాండ్ సినిమాలలో నటించిన మాజీ జేమ్స్ బాండ్ హీరో రోజర్ మూర్.

    రోజర్ మూర్ ఇటీవల జేమ్స్ బాండ్‌ల మీద ఓ పుస్తకాన్ని రచించారు. ఆ పుస్తకం పేరు 'బాండ్ ఆన్ బాండ్'. ఈ పుస్తకంలో రోజర్ మూర్ క్యాసినో రాయల్ తనకు అత్యంత ఇష్టమైన జేమ్స్ బాండ్ సినిమా అని, దీనితో పాటు డేనియల్ గ్రెగ్ నటనంటే ఇంకా ఇష్టమని అన్నాడు. డేనియేల్ గ్రెగ్ అధ్బుతమైన హీరో. జేమ్స్ బాండ్ పాత్రలకు ఖచ్చితంగా సరిపోయే వ్యక్తి. గతంలో వచ్చిన జేమ్స్ బాండ్‌లతో పోలిస్తే డేనియేల్ గ్రెగ్ అద్బుతంగా రాణిస్తున్నాడని పేర్కొన్నాడు.

    దీనితో పాటు త్వరలో జేమ్స్ బాండ్ సిరిస్‌లలో భాగంగా రానున్న 'స్కైఫాల్' సినిమా కోసం తాను ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. నాకు తెలిసి 'క్వాంటమ్ ఆఫ్ సోలెస్' సినిమాతో పోల్చితే 'స్కైఫాల్' సినిమాలో ఎక్కువ భాగం హాస్యం ఉంటుందని అనుకుంటున్నానని అన్నాడు. డేనియల్ గ్రేగ్ హీరోగా 23వ జేమ్స్ బాండ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 23వ జేమ్స్ బాండ్ సినిమాకి 'స్కైఫాల్' అని నామకరణం చేశారు.

    ఈ పేరుని జైమ్స్ బాండ్ పేరు ప్రక్కన ఉన్న డొమైన్ ఆధారంగా తెలుపడం జరుగుతుంది. హాలీవుడ్ షూటింగ్‌కి ముందు సినిమా పేరు రిజస్టర్ చేసుకొవడం ఆనవాయితి. ఈ సినిమాకి మాత్రం జేమ్స్ బాండ్ స్కైఫాల్. కామ్, స్కైఫాల్ ద ఫిల్మ్.కామ్ అంటూ రెండు పేర్లుని రిజస్టర్ చేయించినట్లు సమాచారం.

    ఇకపోతే ఈ సినిమాని ఎమ్‌జిఎమ్, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈసినిమాని ఆస్కార్ అవార్డ్ విన్నర్, టైటానిక్ హీరోయిన్ కేట్ విన్స్ లెట్ మాజీ భర్త శ్యామ్ మెండిస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో జేమ్స్ బాండ్ గర్ల్స్‌గా హెలెన్ మేక్కోరీ, ప్రెంచ్ బ్యూటీ బెరనైస్ మార్లోహీ నటిస్తున్నారు. విలన్‌గా ఆస్కార్ విన్నర్ జేవియర్ బార్డిమ్ నటిస్తున్నారు.

    తెలుగు వన్ఇండియా

    English summary
    Actor Roger Moore, who played James Bond from 1973 to 1985, feels Daniel Craig has been the best actor to play 007.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X