జేమ్స్ బాండ్‌ని సీక్రెట్‌గా పెళ్శి చేసుకున్న మమ్మీ హీరోయిన్
జేమ్స్ బాండ్ స్టార్ డేనియల్ గ్రెగ్, స్టార్ హీరోయిన్ రేచల్ వెయిజ్ సీక్రెట్‌గా న్యూయార్క్‌లో పెళ్శి చేసుకున్నారని రేచల్ వెయిజ్ దగ్గర ఉండేటటువంటి ప్రతినిధి తెలియజేసాడు. అతను చెప్పినటువంటి కదనం ప్రకారం మాత్రమే కాకుండా బ్రిటిష్ పత్రిక న్యూస్ ఆఫ్ ద వరల్డ్‌లో కూడా వీరిద్దరిపై ఓ కధనం ప్రచురించారు. అందులో డేనియల్ గ్రెగ్, రేచల్ వెయిజ్ ఇద్దరూ సీక్రెట్‌గా ఓ న్యూయార్క్ లోని ఓ స్నేహితుని ఇంట్లో పెళ్శి చేసుకోవడం జరిగిందని, ఈ పెళ్శికి కేవలం నలుగురు మాత్రమే హాజరవ్వడం జరిగిందని అన్నారు.
డేనియల్ గ్రెగ్‌కు సంబంధించి ఇద్దరు ఫ్యామిలీ ప్రెండ్స్ తోపాటు, డేనియల్ గ్రెగ్ 18 సంవత్సరాల కూతురు ఎల్లా, అదేవిధంగా రేచల్ వెయిన్ తరుపున రేచల్ 4సంవత్సరాల కొడుకు హెన్రీ హాజరయినట్లు సమాచారం. గ్రెగ్, రేచల్ ఇద్దరూ పోయిన సంవత్సరం డ్రీమ్ హౌస్‌లో కలసి నటించిన నటించడం జరిగింది. ఆ సినిమాలో ఇద్దరు కూడా భార్య, భర్తలు లాగా నటించడం జరిగింది. డ్రీమ్ హౌస్ సినిమా సెప్టెంబర్‌లో అమెరికాలో విడుదల కావాల్సి ఉంది. డేనియల్ గ్రెగ్ గత 20సంవత్సరాలుగా నటిస్తున్నప్పటికీ అతనిని యావత్ ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేసింది కేవలం జేమ్స్ బాండ్ 007 పాత్రలేనని అన్నారు. ఇక రేచల్ వెయిజ్ మమ్మీ సినిమాలో నటించడం జరిగింది.


Click it and Unblock the Notifications











