తండ్రి అయిన జేమ్స్‌బాండ్‌.. 50 ఏళ్ల వయసులో..

By Rajababu

Recommended Video

James Bond Hero Daniel Craig Couple Have A Baby Girl

జేమ్స్‌బాండ్‌గా ప్రపంచ సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన డేనియల్ క్రేగ్ దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. శనివారం రోజను తమ ఫ్యామిలీలోకి కొత్త సభ్యుడికి ఘనంగా ఆహ్వానం పలికారు అని హాలీవుడ్ మీడియా కథనాలను ప్రచురించారు. హాలీవుడ్‌‌లో మరో బాండ్ సినిమాకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇంట్లోకి ఆడపిల్ల రావడం శుభసూచకంగా భావిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

50 ఏళ్ల వయసులో

50 ఏళ్ల వయసులో

జేమ్స్‌బాండ్ పాత్రధారి డేనియల్ క్రేగ్, ఆస్కార్ అవార్డు గ్రహీత, హాలీవుడ్ నటి రాచెల్ వీస్జ్ దంపతులు ఆడ పిల్లలకు జన్మనిచ్చారు. డేనియల్‌కు కూతురు పుట్టిన విషయాన్ని కుటుంబ సభ్యులు అధికారికంగా వెల్లడించారు. ఇంట్లో సంబరాలు జోరందుకొన్నాయి. డేనియల్‌కు 50 ఏళ్లు. రాచెల్‌కు 48 ఏళ్లు కావడం గమనార్హం.

 ప్రైవేట్ వ్యవహారంగా

ప్రైవేట్ వ్యవహారంగా

సాధారణంగా డేనియల్ దంపతులు తమ వ్యక్తిగత జీవితాన్ని అత్యంత ప్రైవేట్‌ వ్యవహారంగా భావిస్తారు. కానీ గత ఏప్రిల్‌లో తన భార్య గర్భం దాల్చిందని అధికారికంగా వెల్లడించారు. ఈ విషయం అప్పట్లో చర్చనీయాంశమైంది.

 పూర్వ వివాహంలో సంతానం

పూర్వ వివాహంలో సంతానం

2011లో డేనియల్, రాజెల్ పెళ్లి చేసుకొన్నారు. అయితే పూర్వ వివాహంలో వారిద్దరికి పిల్లలు ఉన్నారు. డేనియల్ క్రేగ్‌కు ఫియానా లౌడెన్ అనే 26 ఏళ్ల కూతురు ఉంది. ప్రస్తుతం హాలీవుడ్‌లో నటిగా కొనసాగుతున్నారు. రాచెల్‌కు తన మాజీ భర్త, హాలీవుడ్ డైరెక్టర్ డారెన్ అరోన్‌స్కీ ద్వారా 12 ఏళ్ల కుమారుడు ఉన్నారు.

25వ జేమ్స్ బాండ్ చిత్రంలో డేనియల్

25వ జేమ్స్ బాండ్ చిత్రంలో డేనియల్

డానీ బోయ్‌లే దర్శకత్వంలో జేమ్స్‌బాండ్ సిరీస్‌లో 25వ సినిమాను తెరకెక్కించాలనే ప్రయత్నం చేశారు. గతంలో కాసినో రాయల్, స్కైఫాల్, స్పెక్ట్రర్ చిత్రాల్లో నటించిన డేనియల్ క్రేగ్ హీరోగా అనుకొన్నారు. దాంతో ఆ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రంలో బాండ్‌ పాత్రను చంపేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఆ చిత్రం నుంచి దర్శకుడు డానీ బోయ్‌లే ఆ సినిమా నుంచి తప్పుకొన్నట్టు తెలిసింది.

డేనియల్ క్రేగ్ కూడా

డేనియల్ క్రేగ్ కూడా

జేమ్స్‌బాండ్ పాత్రను చంపే విషయంలో దర్శక బోయ్‌లే, నిర్మాత బార్పారా బ్రకోలి, స్టోరి టీమ్ మధ్య క్రియేటివ్ విభేదాలు వచ్చాయి. డేనియల్ క్రేగ్ కూడా బాండ్ పాత్రను చంపేద్దామని ఒప్పుకొన్నారనే వార్త ప్రచారంలో ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X