అబ్రహాం లింకన్ చరిత్ర వెండి తెర మీద..
అమెరికా ప్రెసిడెంట్స్‌లలో అత్యంత శక్తివంతమైన ప్రెసిడెంట్‌గా గుర్తింపు పొందిన వ్యక్తి అబ్రహాం లింకన్. తన తెలివితేటలతో, విధి విధానాలతో అమెరికాకి ప్రపంచ చరిత్రలో తిరుగులేని ఆధిపత్యాన్ని అధిరొహించేలా చేశారు. అలాంటి ప్రముఖ వ్యక్తి జీవిత గాధను ఆధారం చేసుకొని ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ గెలుపొందిన డైరెక్టర్ స్పీల్ బర్గ్ ఓ సినిమాని తీయనున్నారు. ఈ సినిమాలో అబ్రహాం లింకన్ పాత్రకు గాను స్పీల్ బర్గ్ 54సంవత్సరాల వయసు కలిగిన డేనియల్ డే లాయిస్‌ని నటింప జేస్తున్నారు.
డేనియల్ డే లాయిస్ గతంలో అకాడమీ అవార్డుని సొంతం చేసుకున్నారు. అసలు అబ్రహాం లింకన్ పాత్రకు డేనియల్ డే లాయిస్‌ని ఎంచుకొవడానికి కారణం గతంలో డేనియల్ డే లాయిస్ చేసిన పాత్రలు గొప్పవిగా ఉండడం, అతను చేసేటటువంటి నటన చాలా సహాజంగా ఉండటమేనని అన్నారు. సినిమా మొదలైనప్పటి నుండి కూడా డేనియల్ డే లాయిస్ అబ్రహాం లింకన్ పాత్రలో ఒదిగిపోయేందుకు గాను లింకన్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని అన్నారు.
డేనియల్ డే లాయిస్ సినిమా ట్రాక్ రికార్డుని పరిశీలించినట్లేతే 1989 నుండి కేవలం పది సినిమాలలో మాత్రమే నటించారు. ఈయన నటించిన పది సినిమాలలో నాలుగు సినిమాలు ఆస్కార్ నామినేషన్స్ పొందాయి. దీనిని బట్టి డేనియల్ డే లాయిస్ ఒప్పుకునేటటువంటి సినిమాలు ఎలా ఉంటాయో ఈ పాటికే మీకు అర్దమై ఉంటుంది.


Click it and Unblock the Notifications











