twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒకప్పుడు గే కాగా, ఇప్పుడు అమ్మాయిలు బ్రా వేసుకున్నాడు..!

    By Nageswara Rao
    |

    హ్యారీపోటర్ సినిమా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన వ్యక్తి డ్యానియల్ ర్యాడ్ క్లిఫ్. ఇప్పటి వరకు ఆరు భాగాలుగా హ్యారీపోటర్ రావడం జరిగింది. ఇటీవల కాలంలో విడుదలైనటువంటి ఏడవ బుక్ కూడా చాలా ప్రాచుర్యం పోందడం తో ఈ ఏడవ బుక్ కధనాన్ని రెండు భాగాలుగా విడదీసి సినిమా తీయడం జరిగింది. అందులో మొదటి భాగం ఈ నవంబర్ లో యుకెలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక రెండవ భాగాన్ని వచ్చే సంవత్సరం జులైలో విడుదలచేయాలని హ్యారీపోటర్ నిర్నాత వివరించారు.

    ప్రస్తుతం ఈ ఏడవ పుస్తకం మొదటి భాగాన్ని హ్యారీపోటర్ అండ్ ద డెత్ హాల్లోస్ అనే పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించినటువంటి కోన్ని ట్రైలర్స్ హాలివుడ్ కోన్ని గందరగోళం సృష్టిస్తున్నాయి. దానికి కారణం ఈ సినిమా ట్రైలర్స్ లో డ్యానియల్ ర్యాడ్ క్లిఫ్ అమ్మాయిలు ధరించేటటువంటి బ్రాలు ధరించి ఈ ట్రైలర్స్ లో దర్శనమివ్వడంతో ఒక్కసారిగా డ్యానియల్ ర్యాడ్ క్లిఫ్ అభిమానులు అవాక్కయ్యారు. దీనితో డ్యానియల్ ర్యాడ్ క్లిఫ్ సన్నిహితులు కొంతమంది అది సినిమాలో భాగంగా అభివర్ణించారు. ఇక సినిమా కధ విషయానికి వస్తే ఈ సినిమాలో ప్రత్యర్దులను మట్టికరిపంచడంలో హ్యారీపోటర్ శైలి వినూత్నంగా ఉంటుందన్నారు.

    గతంలో కూడా ఒకసారి ఇలానే ప్రపంచంలోని 'గే'ల హక్కుల కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో గే లకు మద్దతుగా నిలిచి, వారి హక్కుల పరిరక్షణకై ఎలుగెత్తాడు. ఇక అప్పటి నుండీ ర్యాడ్ క్లిఫ్ గే అనే ప్రచారం సాగుతోంది. కాగా ఇటీవల ర్యాడ్ క్లిఫ్ ఎంటీవీ లోని ఓ కార్యక్రమానికి హాజరయినప్పుడు మీరు గే అనే వార్త నిజమేనా అనే ప్రశ్నకు అతను అవాక్కయ్యాడు. ఏదో గేల హక్కుల కోసం పోరాడినంతమాత్రానా నన్ను కూడా గే కింద లెక్కేస్తున్నారా అని అన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X