twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భారతదేశంలో విడుదలకు సిద్దమైన 127 అవర్స్

    By Nageswara Rao
    |

    2009వ సంవత్సరం యావత్ భారతదేశ సినీ అభిమానులు గుర్తుంచుకోదగ్గ సంవత్సరం. దీనికి కారణం భారతదేశ చరిత్రలో మొట్టమొదటసారి మనం ఆస్కార్ అవార్డు అందుకున్న సంవత్సరం. ఇది మాత్రమే కాకుండా ఎనిమిది ఆస్కార్ అవార్డులను తెచ్చిపెట్టిన చిత్రం 'స్లమ్ డాగ్ మిలినియర్'. ఈ చిత్రం రూపకర్త డాని బొయేల్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి '127 అవర్స్'. ఈ చిత్రం అరాన్ రాల్ స్టన్ జీవితంలో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా రూపు దిద్దుకుంది. యుయస్, యుకెలలో బాక్సాఫీసు రికార్డుల్ని నమోదు చేసినటువంటి ఈచిత్రం జనవరి 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

    ఇక కధ విషయానికి వస్తే ఈ చిత్రం ఓ యదార్ధ కధను ఆధారంగా చేసుకుని రూపొందించారు. అరాన్ రాల్ స్టన్ జీవితం లో జరిగిన సంఘటనల ఆధారంగా మరియు ఆత్మకధాంశంగా 'బిట్విన్ ఏ రాక అండ్ హార్డ్ ప్లేస్' అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రం రూపొందించారు. ఈ చిత్రంలో అరాన్ రాల్ స్టన్ పాత్రను జేమ్స్ ఫ్రాన్ కో అద్భుతంగా నటించారు. ఈసినిమాలో ఆయన నటించినటువంటి నటనకు గాను ఎంతో మంది ప్రముఖులు ప్రశంసలు అందుకున్నారు. ఇది మాత్రమే కాకుండా మరలా డానీ బోయెల్‌ని ఆస్కార్ నామినేషన్ బరిలో నిలుచునేలా చేసింది.

    ఇక సినిమా విషయానికి వస్తే హీరో అరాన్ రాల్ స్టన్‌కి సాహసయాత్రలు చేయడమంటే ఇష్టం. అతను ఎత్తైన శిఖరాలను అధిరోహిస్తుంటాడు. అలాగే ఒక సాహస యాత్రకు శ్రీ కారం చుడతాడు. అందుకు తగ్గ సామాగ్రిని కావలసిన వస్తువులను తీసుకొని బయలుదేరతాడు. అతని సాహస యాత్రలో భాగంగా ఒక గుట్టపై నుంచి ఇంకో గుట్ట పైకి వెళ్శవలసి వస్తుంది. ఈ రెండు గుట్టల మధ్యలో ఒక పెద్ద రాయి వుంటుంది. ఈ రాయ సహాయంతో గుట్టను దాటే క్రమంలో ఆ రాయి పైన నిలుచుంటాడు.

    ఆ రాయి కాస్తా జారిపడిపోతుంది. ఈ రాయితో పాటు అరాన్ రాల్ స్టన్ కూడా కిందపడబోతున్న క్రమంలో అతని చేయి రెండు గుట్టల మధ్య ఇరుక్కుపోతుంది. ఆటను కదలలేని పరిస్దితి. ఇలా ఆతను '127 గంటలు' ఉంటాడు. ఆ తరువాత ఏం జరిగింది...? ఈ 127 గంటలు అతను ఏం చేసాడు అన్నది '127 అవర్స్' చిత్రంలో చూడాల్సిందే. ఈ చిత్రంలో అంతర్లీనంగా ఒక చక్కని సందేశం కూడా వుంటుంది. ఎలాంటి పరిస్దితుల్లోనైనా ధైర్యం మాత్రం విడిచిపెట్టకూడదు అన్నది.

    English summary
    127 Hours is a 2010 biographical adventure film produced, co-written and directed by Danny Boyle. The film stars James Franco as real-life mountain climber Aron Ralston, who became trapped by a boulder in Robbers Roost, Utah, for more than five days in 2003.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X