Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అమెరికా అధ్యక్షుడి ప్రాణాలు తీయడానికై హెలీకాప్టర్ నుండీ కిందకు దూకేసిన జోలీ..!!
హాలీవుడ్ హాట్ తార, 'డేర్ డెవిల్' అని ముద్దుగా పిలువబడే ఈ దశాబ్దపు అందమయిన యువతి ఎంజలీనా జోలీ తన తాజా చిత్రం సాల్ట్ చిత్రం రీ-షూట్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ రీ-షూట్ లో ఆమె ప్రాణాలకు తెగించి చేస్తున్న సాహసాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజా ఈ రీ-షూట్ లో భాగంగా ఈ డేర్ డెవిల్ ఎలాంటి స్టంట్ డబుల్ సాయం లేకుండా, కేవలం ఓ తాడు సాయంతో హెలీకాప్టర్ నుండీ దూకేసి డిష్యుం..డిష్యుం అని ఫైట్లు చేసి అందరినీ ఆశ్యర్యపరిచిందట. తొలుత ఈ సీన్ షూట్ కోసం స్టంట్ సాయం తీసుకుని చేద్దామని దర్శకుడు భావించినా, జోలీ మాత్రం అవేవీ లేకుండా రంగంలోకి దిగి తనెంత ధైర్యవంతురాలో మరో సారి ప్రపంచానికి చాటి చెప్పింది. ఇంతటి దృఢ వ్యక్తిత్వం కలిగిన ఆమెను దశాబ్దపు అందమయిన మహిళగా గుర్తింటడం సమజసంమే అని సెట్ లోని వారంతా ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారట.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే జోలీని అమెరికా అధ్యక్షున్ని చంపడానికి వచ్చిన రష్యాకు చెందిన గూఢచారిగా అనుమానించి ఆమెను హతమార్చేందుకు అమెరికన్ సైన్యం ప్రయత్నిస్తుడటం, ఆ తర్వాత ఆమె ఎలా వారి నుండీ తనను తాను రక్షించుకుని నిర్ధోషిత్వాన్ని నిరూపించుకుంది అనే అంశం చుట్టూ తిరుగుతుంది. తొలుత ఈ సినిమా లో జోలీ భర్త చనిపోయే విధంగా షూట్ చెయ్యగా, అది చూసిన తర్వాత దర్శకనిర్మాతలకు ఆ తర్వాత నచ్చలేదట, దీనికి తోడు క్లైమాక్స్ సైతం అనుకున్నంత ఘనంగా లేకపోవడంతో ఈ రీ-షూట్ చేస్తున్నారట. ఈ హెలీకాప్టర్ సీక్వెన్స్ తప్పక సినిమాలో హైలెట్ అవుతుందని దర్శకుడు చెబుతున్నాడు.
కాగా తొలుత ఈ సినిమాను టామ్ క్రూజ్ ప్రధాన పాత్రలో రూపొందించాలని కథను సిద్ధం చేసినా ఆ తర్వాత ప్రధాన పాత్రను ఏంజలీనా జోలీ పోషించేలా కథను మార్చి తీస్తున్నారట. ఈ యాక్షన్ థ్రిల్లర్ వేసవి సందర్భంగా జులై నెలలో విడుదల కానుంది.