కోస్టార్స్‌తో డేటింగ్ చేస్తేనే కదా సీన్స్ పండేది
ఇంగ్లీషు సినిమా 'వెయిటింగ్ ఫర్ ఫరెవర్' ద్వారా హాలీవుడ్ సినిమాలో వెలుగులోకి వచ్చిన 'రాచెల్ బిల్సన్' తన కోస్టార్స్ తో డేటింగ్ చేయడంలో ఎటువంటి తప్పు లేదని అన్నారు. ఐదు సంవత్సరాల తర్వాత 2007వ సంవత్సరంలో 'జంపర్' సినిమాలో తనతో కలసి నటించిన 'హేడెన్ క్రిస్టన్సేన్'ని కలసిన సందర్బంగా ఈ మాటలను వెల్లడించారు.
కోస్టార్స్‌తో డేటింగ్ చేయడం అనేది సహాజం. మీరు ఎవరితోనైనా కలసి పని చేసేటప్పుడు ఇలాంటివి అలవాటు చేసుకోవాలన్నారు. సినిమా చిత్రీకరణంలో మనం ఎంతో మందిని కలవాల్సి వస్తుంది. నా జీవితంలో అలాంటి వారిని చాలా మందిని కలవడం జరిగింది. నా విషయంలోనే కాదు సినిమాలలో నటించే ప్రతి హీరోయిన్ జీవితంలో కోస్టార్స్ తో డేటింగ్ చేస్తేనే రొమాన్స్ చక్కగా పండుతుందనేది నా అభిప్రాయం.
'రాచెల్ బిల్సన్' 2006 వరకు తన కోస్టార్ ఆడమ్ బ్రూడీతో మూడు సంవత్సరాల పాటు డేటింగ్ చేశారు. ఆమె ఎవరితోనైనా సంబంధం కొనసాగించాలని అనుకున్నప్పడు రెండు వారాల తర్వాత మాత్రమే అతనికి ఐ లవ్ యు అని చెప్తానని తెలిపారు. ఈ నిర్ణయం వ్యక్తి మరియు సంబంధం మీద ఆధారపడి ఉంటుందని అన్నారు. నాకు ఒప్పు అనిపిస్తే అతనితో కొనసాగుతాను.. ఎందుకంటే రూల్స్‌ని బట్టి ప్రేమ పుట్టదు. అందతా ఓ కెమిస్ట్రీ అని అన్నారు.


Click it and Unblock the Notifications











