సెలబ్రిటీలతో డేటింగ్ చేయడం చాలా ఈజీ..
హాలీవుడ్ స్టార్ హీరో బ్లాడ్లీ కూపర్ సెలబ్రిటీలతో డేటింగ్ చేయడం కంటే ఈజీ పని మరోకటి ఉండదని అంటున్నారు. ఇటీవల కాలంలో హాలీవుడ్ సింగర్, హీరోయిన్ జెన్నిఫర్ లోపెజ్‌తో డేటింగ్ చేస్తూ మీడియాకి దొరికిపోయిన విషయం అందరికి తెలిసిందే. జెన్నిఫర్ లోపెజ్ తన మాజీ భర్త మార్క్ ఆంటోనీ నుండి విడాకులు తీసుకొవడానికి ఇది కూడా ఒక కారణంగా హాలీవుడ్లో గుసగుసలు ఆడుకుంటున్నారు.
బ్రాడ్లీ కూపర్‌కి కేవలం ఒక్క జెన్నిఫర్ లోపెజ్‌తోనే కాకుండా ఓలివా విల్డీతో కూడా శారీరక సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. అసలు మీరు సెలబ్రిటీలతో డేటింగ్ ఎలా చేస్తారని ప్రశ్నించగా సాధారణంగా సెలబ్రిటీలు పబ్లిక్‌లో ఎక్కవ కాలం గుర్తుండాలంటే వారికి పబ్లిసిటీ ఉండాలి. అసలు పబ్లిసిటీ ఎప్పుడు లభిస్తుందంటే ఇలాంటి డేటింగ్స్, రొమాంటిక్ స్నేహాలు ఉన్నప్పుడేనని తన మనసులోని మాటలను వెల్లడించారు.
36 సంవత్సరాలు వయసు కలిగిన హీరో బ్లాడ్లీ కూపర్ మనిషి జీవితంలో కనెక్షన్, కెమిస్ట్రీ అనేది చాలా అద్బుతమైనదని అన్నారు. ఈ రెండు ఏర్పాడాలంటే ఇద్దరు వ్యక్తులు తప్పని సరి. మీడియాలో వీరిద్దరి మద్య ఉన్న సంబంధాల్ని చక్కగా ఉపయోగించుకుంటే ఎక్కువ కాలం అభిమానులకు గుర్తు ఉండడమే కాకుండా అలా చరిత్రలో నిలచిపోతామని చాలా తెలివిగా మాట్లాడారు.


Click it and Unblock the Notifications











