పుట్టినరోజు నేనందుకున్న అపురూపమైన కానుక
లాస్ ఏంజిల్స్: సాకర్ ప్లేయర్ డేవిడ్ బెకహాం తన జీవితంలో ఉత్తమ పుట్టిన రోజు కానుకను అందుకున్నానంటూ ఫేస్‌బుక్‌లో ఆ కానుకను ఇమేజితో సహా తీసి పోస్ట్ చేశాడు. బెకహాం తన పుట్టిన రోజుని బుధవారం నాడు అంగరంగ వైభవంగా తన తల్లితో పాటు భార్య, పిల్లలతో చేసుకున్నాడు.
ఇంతకీ బెకహాం అందుకున్న ఆ అపురూపమైన కానుక ఏంటంటే మాజీ అమెరికా ప్రొఫెషనల్ బాస్కెట్ బాల్ క్రీడాకారుడు ఎర్విన్ 'మ్యాజిక్' జాన్సన్ సంతకం జెర్సీని డేవిడ్ బెకహాం భార్య విక్టోరియా బెకహాం పుట్టిన రోజు కానుకగా ఇచ్చింది. దీంతో బెకహాం సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో వెంటనే తన భార్య ఇచ్చిన పుట్టిన రోజు గిఫ్ట్‌ని అందుకోని తన ఫేస్‌బుక్ ఎకౌంట్లో ఉత్తమ పుట్టిన రోజు కానుక అంటూ ఫోస్ట్ చేశాడు.
దీనితో పాటు డేవిడ్ బెకహాం తన పుట్టినరోజున కట్ చేసిన కేక్ ఇమేజిని కూడా పోస్ట్ చేశారు. నా పుట్టిన రోజుని ఎంతో స్పెషల్‌గా చేసిన నా ఫ్యామిలీకి కృతజ్ఞతలంటూ ఫోస్ట్ చేశాడు. 2012వ సంవత్సరానికి గాను 'ప్లానెట్ పై సెక్సియస్ట్ మ్యాన్' అవార్డుని సాకర్ ఆటగాడు ఫ్యాషన్ ఐకాన్ 'డేవిడ్ బెకహాం' సొంతం చేసుకున్నారు. 36 సంవత్సరాల వయసు కలిగిన డేవిడ్ బెకహాంకి ఈ టైటిల్‌ని హీట్ మ్యాగజైన్ ఇచ్చింది. ప్రపంచం మొత్తం మీద 101 మంది హాటెస్ట్ సెలబ్రిటీలను సెలక్ట్ చేయగా.. వారిలో మొట్టమొదటి స్దానాన్ని డేవిడ్ బెకహాం సొంతం చేసుకున్నారు.


Click it and Unblock the Notifications











