మైదానంలో హీరో, డ్యాన్స్ ఫ్లోర్ పై జీరో
లండన్, జూన్ 5: ప్రపంచంలో పుట్ బాల్ తెలిసిన వారికి పరిచయం అక్కర లేని పేరు డేవిడ్ బెకహాం. మే 2 1975లో డేవిడ్ రాబర్ట్ జోసెఫ్ బెకహాంగా ఇంగ్లాండ్‌లో జన్మించిన ఈ పుట్ బాల్ ఆటగాడు లాస్ ఏంజిల్స్ గెలాక్సీ జట్టు తరుపున ఆడేవాడు. వీటితో పాటు గతంలో మాంచెస్టర్ యునైటెడ్, ప్రెస్టన్ నార్త్ ఎండ్, రియల్ మాడ్రిడ్, మిలన్ లాంటి గొప్ప గొప్ప జట్ల తరుపున ఆడడంతో పాటు ఇంగ్లాండ్ జాతీయ జట్టులో 'అవుట్ ఫీల్డ్ ప్లేయర్' రికార్డు నమోదు చేశాడు.
మాంచెస్టర్ యునైటెడ్‌తో పుట్ బాల్ కెరీర్‌ని ప్రారంభించిన డేవిడ్ బెకహాం 17 సంవత్సరాల వయసులో 1992లో అరంగేట్రం చేశాడు. బెకహాం అడుగు పెట్టగానే మాంచెస్టర్ యునైటెడ్ జట్టు ఆరుసార్లు ప్రీమియర్ లీగ్ టైటిల్ తో పాటు, FA Cupని రెండు సార్లు, 1999వ సంవత్సరంలో UEFA Champions League కైవసం చేసుకుంది. ఆ తర్వాత మాంచెస్టర్ యునైటెడ్‌ని వదిలి 2003వ సంవత్సరంలో రియల్ మాడ్రిడ్ జట్టులో చేరాడు. ఆ తర్వాత లాస్ ఏంజిల్స్ గెలాక్సీ, మిలన్ జట్ల తరుపున తన సత్తా చాటాడు.
ఆ తర్వాత 21 సంవత్సరాల వయసులో 1996 సెప్టెంబర్ 1వ తారీఖున ఇంగ్లాండ్ జాతీయ పుట్ బాల్ జట్టులో చేరాడు. నవంబర్ 15, 2000వరకు ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్‌గా, 2006 FIFA World Cup ఫైనల్స్ వరకు జట్టుకు తన సేవలను అందించాడు. రెండు సార్లు FIFA World Cup ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని దక్కించుకున్నాడు. గాయం కారణంగా 2010 World Cupని మిస్ అయ్యాడు.
అక్టోబర్ 14, 2009 నుండి ఇంగ్లాండ్ జట్టు తరుపున అడడం మానివేశాడు.
ఎడ్వర్టైజింగ్, ఆట ద్వారా 2004వ సంవత్సరంలో ఎక్కువ మొత్తం డబ్బు సంపాదించే అటగాడిగా రికార్డు సృష్టించాడు. 100 ఛాంపియన్స్ లీగ్ ఆడిన బ్రిటిష్ ఆటగాడు బెకహాం మాత్రమే. ఆట ఆడడంలో ఎంత ఉన్నతంగా ఉంటాడో నిజ జీవితంలో అంతే ఉన్నతంగా బెకహాం ఉంటున్నాడు. తనని ఎంతగానో ప్రేమించిన ఫ్యాషన్ డిజైనర్ విక్టోరియా బెకహాంను వివాహాం చేసుకున్నాడు. వీరికి నలుగురు పిల్లలు. బ్రూక్లెయిన్ జోసెఫ్, రోమియో జేమ్స్, క్రూయిజ్ డేవిడ్, హార్పర్ సెవన్.
ఇటీవల ఓ సందర్బంలో డేవిడ్ బెకహాం గురించి అతని భార్య విక్టోరియా బెకహాం మాట్లాడుతూ మైదానంలో డేవిడ్ ఎంతబాగా తన కాళ్లతో మ్యాజిక్ చేస్తాడో.. డ్యాన్స్ ఫ్లోర్ మీద అంతే మ్యాజిక్ చెయ్యాలని చూస్తాడు. బెకహాం తన ఇంట్లో డ్యాన్స్ చేసిన వీడియోని సీక్రెట్‌గా షూట్ చేసి... నాకు మ్యూజిక్ అంటే ఇష్టం, డేవిడ్ కూడా మ్యూజిక్‌ని చాలా అమితంగా ప్రేమిస్తాడని తెలిపింది.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











