భార్య సన్‌బాత్ చేసే పిక్చర్‌ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఆటగాడు
ఇటీవల కాలంలో సెలబ్రిటీలు వారియొక్క పర్సనల్ ఫోటోలను సోషల్ మీడియో వెబ్ సైట్లు అయినటువంటి ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో పోస్ట్ చేయడం సాధారణమై పోయింది. ఇప్పుడు కొత్తగా ఈ కోవలోకి మరో స్టార్ ఆటగాడు వచ్చి చేరాడు. ఇంతకీ ఎవరా ఆ స్టార్ ఆటగాడు అని అనుకుంటున్నారా.. పుట్ బాల్ స్టార్ ఆటగాడు ఫ్యాషన్ ఐకాన్ అయినటువంటి డేవిడ్ బెకహాం. ఇంతకీ డేవిడ్ బెకహాం ఏమి చేశాడంటే తన భార్య విక్టోరియా బెకహాం ప్రెగ్నంట్‌గా ఉన్నప్పుడు ఇచ్చిన ఫోటో ఫోజుని సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ అయిన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.
ఇలా చేయడం ఈ మద్య కాలంలో సెలబ్రిటీలకు పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. వారియొక్క ప్రయివేటు పిక్చర్స్‌ని వారంతట వారే వారియొక్క ట్విట్టర్, ఫేస్‌బుక్, బ్లాగ్స్ ద్వారా అభిమానులను ఉత్తేజపరచడం కోసం ఇలా చేస్తున్నారు. అటువంటి సెలబ్రిటీ లిస్ట్‌లో ఇప్పుడు డేవిడ్ బెకహాం కూడా చేరాడు. ఇంతకీ ఆ ఫోటోలో ఏముందని అనుకుంటున్నారా.. విక్టోరియా బెకహాం ప్రెగ్నెంట్‌గా ఉన్న సమయంలో సూర్య స్నానం చేస్తున్నసమయంలో వెల్లికిలా పడుకోని ఉన్న పోటో. ఈ ఫోటోని విక్టోరియా బెకహాంకి తెలియకుండా తాను తీశానని డేవిడ్ బెకహాం ఫేస్‌బుక్‌లో తెలియజేశారు. అంతేకాకుండా ఈ పోటోలో విక్టోరియా బెకహాం చూడడానికి చాలా అందంగా ఉందని అన్నారు.


Click it and Unblock the Notifications











