ఆ సినిమాలో హీరో, హీరోయిన్స్ మద్య రొమాన్స్ అదుర్స్
'దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే' ఈ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన సినిమా. ఈ సినిమా సృష్టించిన రికార్డులు అన్నీ, ఇన్నీ కావు. ముంబైలో ఉన్న ఓ ధియేటర్‌లో ఈ సినిమా సంవత్సరం పాటు ఆడడం జరిగింది. దీనిని బట్టి ఈ సినిమా స్టామినా ఏంటో మీకు అర్దం అయ్యే ఉంటుంది. అలాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా ఇప్పుడు హాలీవుడ్‌లో హాల్‌చల్ చేస్తుంది.
హాలీవుడ్ రొమాంటిక్ హీరోగా ఇటీవల మొట్టమొదటి స్దానాన్ని కైవసం చేసుకున్న రాబర్ట్ ప్యాటిన్సన్ ఆల్ టైమ్ ఫేవరేట్ ఐదు సినిమాలలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, కాజోల్ జంటగా నటించిన 'దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే' సినిమా ఒకటని ఇటీవల వెల్లడించారు. ఇక తనకు నచ్చిన ఐదు సినిమాల గురించి సమాచారాన్ని కూడా వెల్లడించారు. నా జీవితంలో నాకు నచ్చిన ఐదు సినిమాలు, నేను వాటిని చూసిన తర్వాత కొంత ప్రేరణ పొందిన సినిమాలు ఇవేనని తెలిపారు.
వాటిల్లో మొట్టమొదటి స్దానాన్ని నాటింగ్ హిల్, 50 ఫస్ట్ డేట్స్, స్వీట్ నవంబర్, ఘోస్ట్, దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే అని తెలిపారు. దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే సినిమాలో హీరో, హీరోయిన మద్య వచ్చేటటువంటి కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు అద్బుతంగా ఉంటాయని కొనియాడారు. ఇది ఇలా ఉంటే రాబర్ట్ ప్యాటిన్సన్ నటించిన 'ద ట్విలైట్ సాగా: బ్రేకింగ్ డాన్' అనే సినిమా నవంబర్ 18న విడుదలకు సిద్దంగా ఉంది. ఇది ట్విలైట్ సిరిస్‌కు కొనసాగింపుగా వస్తున్నసినిమా.


Click it and Unblock the Notifications











