twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆశ్చర్యం: అంత పెద్ద హీరో అంత తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నాడా?

    By Bojja Kumar
    |

    Recommended Video

    Brad Pitt Prefers Less Remuneration For a Movie

    ప్రఖ్యాత ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ మార్వెల్ పిక్చర్స్ నుండి వచ్చిన భారీ యాక్షన్ చిత్రాల్లో 'డెడ్ పూల్' సిరీస్ చిత్రాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సిరీస్‌లో 2016లో వచ్చిన తొలి మూవీ సంచలన విజయం సాధించింది. ఈ ఏడాది 'డెడ్‌పూల్ 2' మూవీ విడుదలైంది. రూ. 750 కోట్లకు‌పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలై రూ. 5వేల కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసి మార్వెల్ సంస్థకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో రియాన్‌ రేనాల్డ్స్‌ హీరోగా నటించగా... ప్రముఖ హాలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్ అతిథి పాత్రలో మెరిశారు.

    వానిషర్‌ పాత్రలో బ్రాడ్‌ పిట్

    వానిషర్‌ పాత్రలో బ్రాడ్‌ పిట్

    మార్వెల్ కామిక్‌ పాత్రల్లో ఒకటైన వానిషర్‌గా బ్రాడ్ పిట్ కనిపించారు. సినిమాలో ఎక్కువశాతం ఈ పాత్ర అదృశ్య రూపంలో ఉంటుంది. ఒకే ఒక సీన్లు మాత్రం బ్రాడ్ పిట్ కనిపిస్తారు.

    రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారు?

    రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారు?

    ఈ సినిమాలో అతిథి పాత్ర చేసినందుకు బ్రాడ్‌ ఫిట్ ఎంత తీసుకున్నారు? అనేది చర్చనీయాంశం అయింది. రూ. 750 కోట్లకు‌పైగా బడ్జెట్‌తో సినిమా తీశారు కాబట్టి ఆయనకు ఎన్నో కొన్ని కోట్లు ఇచ్చి ఉంటారని అంతా భావించారు. కానీ బ్రాడ్ పిట్ ఈ సినిమా చేయడానికి ఏం అడిగాడో తెలిస్తే ఆశ్చర్య పోతారు.

     అడగ్గానే ఓకే చెప్పాడట

    అడగ్గానే ఓకే చెప్పాడట

    ఈ సినిమలో గెస్ట్ రోల్ చేయాలని అడగ్గానే ఓకే చెప్పిన బ్రాడ్ పిట్.... తనకు ప్రత్యేకమైన రెమ్యూనరేషన్ అవసరం లేదని, నిబంధనల ప్రకారం మినిమమ్ స్కేల్ ప్రకారం చెల్లిస్తే చాలని చెప్పాడట. దీంతో పాటు హీరో రియాన్‌ రేనాల్డ్స్‌ స్టార్‌బక్స్‌ నుంచి స్వయంగా కాఫీ తెచ్చి ఇవ్వాలని కోరాడట.

    అంత తక్కువకే...

    అంత తక్కువకే...

    కేవలం అరగంట సమయంలో బ్రాడ్ పిట్ సీన్ పూర్తి చేశారు. నిబంధనల ప్రకారం నిర్మాతలు బ్రాడ్ పిట్‌కు వెయ్యి డాలర్ల కంటే తక్కువే చెల్లించారట. అంత పెద్ద స్టార్ అయుండి ఇంత తక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవడం అందరినీ ఆశ్చర్య పరిచింది.

    బ్రాడ్ పిట్

    బ్రాడ్ పిట్

    బ్రాడ్ ప్రస్తుతం యాడ్ ఆస్ట్రా, వన్స్ అపానె టైమ్ ఇన్ హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్నాడు. దీంతో పాటు బ్యూటిఫుల్ బాయ్, బ్యాక్ సీట్, యాడ్ ఆస్ట్రా, ది కింగ్ లాంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

    English summary
    "Deadpool 2" screenwriter Rhett Reese confirms a certain A-list movie star "worked for scale" when he agreed to make the sequel's best cameo appearance.“We shot in about a half an hour,” Reese said of Pitt filming the cameo. “It was quite a production. It was like a full crew for a half an hour, and Brad agreed to do it for scale, plus a cup of coffee.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X