»   » హాలీవుడ్ మూవీ ‘డెడ్‌పూల్-2 ట్రైలర్ రిలీజ్ చేసిన హీరో నాని

హాలీవుడ్ మూవీ ‘డెడ్‌పూల్-2 ట్రైలర్ రిలీజ్ చేసిన హీరో నాని

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్ చిత్రసీమ నుండి ఇటీవలే 'అవేంజర్స్ : ఇన్ఫినిటీవార్' సినిమా వచ్చి సూపర్ హిట్ అయింది. తాజాగా మరో హాలీవుడ్ మూవీ ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయడానికి వస్తోంది. 2016లో హాలీవుడ్లో తెరకెక్కిన 'డెడ్‌పూల్' చిత్రం భారీ విజయం సాధించడంతో తాజాగా సీక్వెల్‌గా తాజాగా 'డెడ్‌పూల్-2' తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. తాజాగా హీరో నాని చేతుల మీదుగా విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది.

''డెడ్‌పూల్‌ 2' తెలుగు ట్రైలర్‌ను‌ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. తెలుగు డబ్బింగ్‌ సౌండ్స్‌ చాలా ఫన్నీ‌గా ఉన్నాయి. మే 18న చిత్రం విడుదల కాబోతోంది' అని నాని ట్విట్టర్ ద్వారా తెలిపారు.

Deadpool 2 Telugu Trailer

ఒళ్లు గగుర్బొడిచే భారీ యాక్షన్‌తో పాటు ఫన్నీ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయడం ఈ సినిమా ప్రత్యేకత. హాలీవుడ్ స్టార్ రేయాన్‌ రేనాల్డ్‌ ఇందులో డెడ్‌పూల్‌గా కనిపించనున్నారు. 20th సెంచరీ ఫాక్స్‌ ఈ సినిమాను మే 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

తెలుగు ప్రేక్షకులు మెచ్చేలా, నవ్వు పుట్టించేలా ఫన్నీగా ఈ సినిమాలో కొన్ని డైలాగులు రాశారు. సంభాషణల పరంగా తెలుగు సినిమా చూసిన ఫీలింగ్ కలిగించే ప్రయత్నం చేశారు. భారీ యాక్షన్ సీన్ల మధ్య ఈ డైలాగులు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తనున్నాయి.

English summary
Deadpool 2 Telugu Trailer released. After surviving a near fatal bovine attack, a disfigured cafeteria chef (Wade Wilson) struggles to fulfill his dream of becoming Mayberry’s hottest bartender while also learning to cope with his lost sense of taste. Searching to regain his spice for life, as well as a flux capacitor, Wade must battle ninjas, the yakuza, and a pack of sexually aggressive canines, as he journeys around the world to discover the importance of family, friendship, and flavor – finding a new taste for adventure and earning the coveted coffee mug title of World’s Best Lover.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X