»   » డిస్నీ చిత్రాల స్టార్ హీరో డీన్‌ జోన్స్‌ మృతి

డిస్నీ చిత్రాల స్టార్ హీరో డీన్‌ జోన్స్‌ మృతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజల్స్ : 'దట్‌ డార్న్‌ క్యాట్‌', 'ది లవ్‌ బగ్‌' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు డీన్‌ జోన్స్‌(84) కన్నుమూశారు. కొంతకాలంగా నరాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న ఆయన లాస్‌ఏంజిలెస్‌లో తుదిశ్వాస విడిచారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

'డీన్‌ జోన్స్‌ సింగ్స్‌' రేడియో కార్యక్రమానికి వ్యాఖ్యాతగా జోన్స్‌ ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత ఆయన కొన్ని నాటకాలకు నిర్మాతగా వ్యవహరించారు. 1956లో 'సమ్‌బడీ అప్‌ దేర్‌ లైక్స్‌ మి'తో నటుడిగా మారారు. ఆయన నటించిన చిత్రంలోని ఫేమస్ సీన్...

డిస్నీ సంస్థ నిర్మించిన ది మిలియన్‌ డాలర్‌ డక్‌, స్నోబాల్‌ ఎక్స్‌ప్రెస్‌, హెర్బీ గోస్‌ టు మాంటె కార్లో చిత్రాల్లో జోన్స్‌ హాస్య ప్రధాన పాత్రల్లో ఆకట్టుకున్నారు. 50కి పైగా చిత్రాల్లో నటించారు. నటనతో పాటు సేవాకార్యక్రమాలపైనా దృష్టిపెట్టిన జోన్స్‌ బాలల సంరక్షణ, ఆహార కొరత నిర్మూలన అంశాల్లో కృషి చేశారు.

Dean Jones, boyish Disney star, dies at 84

డీన్ జోన్స్ కు హాలీవుడ్ కు చెందిన ప్రముఖులు చాలా మంది నివాళులు అర్పించారు.

English summary
Dean Jones, whose boyish good looks and all-American manner made him Disney's favorite young actor for such lighthearted films as "That Darn Cat!" and "The Love Bug," has died of Parkinson's disease. He was 84.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu