For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెట్ గాలా 2019: హీరోయిన్ల వింత లుక్, అండర్ వేర్లో హాట్ బ్యూటీ, హీరో తలనరికి చేతిలో పెట్టినట్లుగా..

|
Met Gala 2019 : Priyanka Chopra And Deepika Padukone Poses On Met Gala Carpet || Filmibeat Telugu

ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రిటీలు న్యూయార్కులో జరుగుతున్న 'మెట్ గాలా 2019' వేడుకలో సందడి చేస్తున్నారు. ఇక్కడి మెట్రోపాలిటన్ మ్యూజియంలో ఈ వేడుక సోమవారం అట్టహాసంగా ప్రారంభం అయింది. హాలీవుడ్ తారలతో పాటు అమెరికన్ పాప్ స్టార్లు, వివిధ దేశాల నుంచి సినీ తారలు ఈ వేడుకలో సందడి చేస్తున్నారు.

ఇండియా నుంచి ప్రియాంక చోప్రా, దీపిక పదుకోన్ సైతం సోమవారం జరిగిన ప్రారంభ వేడుకలో సందడి చేశారు. తారలంతా విభిన్నమైన వస్త్రాలంకరణతో తమ ప్రత్యేకత చాటుకున్నారు. కొందరు స్టార్స్ వింత అవతారాలతో దర్శనమిచ్చి షాకిచ్చారు. అందులో కొన్ని భయానకంగా ఉండటం గమనార్హం.

మెట్ గాలా 2019

న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్స్‌, కాస్ట్యూమ్‌ ఇన్‌స్టిట్యూట్ ప్రతి సంవత్సరం ‘మెట్ గాలా' కార్యక్రమం నిర్వహిస్తున్నది. సెలబ్రిటీలంతా ఈ వేడుకలో వింత దుస్తులతో హాజరవుతుంటారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే విరాళాలను ఛారిటీ కోసం వినియోగిస్తారు.

చేతిలో తలతో.. భయానక దృశ్యం

అమెరికన్ నటుడు జేరెడ్ లెటో... భయానక అవతారంలో ఈ వేడుకలో దర్శనమిచ్చారు. తన తల నరికి చేతిలో పట్టుకున్నట్లుగా ఉన్న ఈ దృశ్యం చూసి అంతా షాకయ్యారు. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం జరిగిన ఈ వేడుకలో జేరెడ్ లెటో అందరి దృష్టినీ ఆకర్షించాడు.

బాబోయ్ ఈవిడా... ప్రియాంక చోప్రా?

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా సైతం ఈ వేడుకలో సందడి చేశారు. మెట్ గాలాలో ఆమె అవతారం కాస్త వింతగానే ఉంది. పరీక్షించి చూస్తే తప్ప ఆవిడను గుర్తు పట్టడం కష్టం. ప్రత్యేకంగా డిజైన్ చేసిన గౌనులో, కర్లింగ్ హెయిర్‌తో ఈ అమెరికా కోడలు పిల్ల తన ప్రత్యేకతను చాటుకుంది. ఈ వేడుకకు ఆమె భర్త, సింగర్ నిక్ జోనస్ కూడా హాజరయ్యారు.

అండర్ వేర్లో హాజరైన లేడీ గాగా

ప్రముఖ అమెరికన్ పాప్ సింగర్, నటి లేడీ గాగా అండర్ వేర్ డ్రెస్సులో హాజరయ్యారు. ఆ తర్వాత వివిధ రకాల ఔట్ ఫిట్స్ మార్చి అక్కడికి వచ్చిన వీక్షకులకు కనువిందు చేశారు. ఈ వేడుకలో లేడీ గాగా మూడు రకాల వస్త్రధారణతో తన ప్రత్యేకతను చాటుకుననారు.

క్రొవ్వొత్తులతో దేవతలా దర్శనమిచ్చిన కేటీ పెర్రీ

ప్రముఖ అమెరికన్ సింగర్ కేటీ పెర్రీ క్యాండిలియర్ డ్రెస్సులో దర్శనమిచ్చారు. పింక్ కార్పెట్ మీద ఆమె వయ్యారంగా నడుచుకుటూ వస్తుంటే ఏంజిల్ నడిచొచ్చినట్లే ఉందంటూ అభిమానులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. జెరెమీ స్కాట్ ఆమెకు సంబంధించిన లుక్ డిజైన్ చేశారు.

బార్బీ బొమ్మలా దీపిక పదుకోన్

బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకోన్ గులాబీ రంగు గౌనులో బార్బీ బొమ్మలా దర్శనమిచ్చారు. దీపిక ఈ లుక్‌లో మరింత అందంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బాలీవుడ్ నుంచి తొలి రోజు ప్రియాంక, దీపిక సందడి చేశారు. ఈ వేడుకలో అధినేత ముఖేశ్‌అంబానీ కూతురు ఇషా కూడా పాల్గొనడం విశేషం.

English summary
We're here with the MET Gala 2019 pictures and whoa! Whoa! Whoa! Bollywood divas Priyanka Chopra and Deepika Padukone have totally left us speechless with their avatars for the festivities. If on the one side, Deepika turned into a Barbie to grace the MET Gala 2019, on the other side, Priyanka goes totally unrecognizable, while gracing the gala with her husband Nick Jonas.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more