ట్రిపుల్ ఎక్స్ మూవీకి నో.. హాలీవుడ్ నటుడికి షాకిచ్చిన దీపికా పదుకోన్
ఇంట గెలిచి రచ్చ గెలువాలన్న సామెతను పాటిస్తున్న వారిలో బాలీవుడ్ అందాల భామ దీపికా పదుకొన్ ఒకరు. బాలీవుడ్‌లో అగ్రనటిగా రాణిస్తున్న సమయంలోనే హాలీవుడ్‌లోకి దూకి ఘనమైన కీర్తిని, విజయాలను సొంతం చేసుకొంటున్నారు దీపికా పదుకోన్.
ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ ఎక్సాండర్ కేజ్ అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రంలో దీపిక నటిస్తున్నదని ఆ చిత్ర దర్శకుడు డీజే కరుసో ట్విట్టర్‌లో కన్ఫర్మ్ చేశారు.

కానీ దర్శకుడి స్టేట్‌మెంట్‌కు విరుద్ధంగా ముంబై మీడియా కథనాల్లో వార్తలు కనిపిస్తున్నాయి. ట్రిపుల్ ఎక్స్ సినిమాకు సీక్వెల్ నటించమని దీపికను ఇంతవరకు ఎవరూ సంప్రదించలేదు అని కథనాల్లో పేర్కొన్నారు. ట్రిపుల్ ఎక్స్ 4 చిత్రంలో నటింపజేయాలని విన్ డిజిల్, డీజే కరుసో భావిస్తున్నప్పటికీ.. ఆ చిత్రంలో నటించడానికి దీపిక విముఖత చూపిస్తున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











