అతడు పీకల్లోతు ప్రేమలో.. కలిసి జీవిస్తున్నాం.. నా మది నిండా ఆయనే.. దీపిక పదుకొనే..

By Rajababu

బాలీవుడ్‌లో అగ్రతారగా వెలుగొందిన అందాల తార దీపికా పదుకోన్ ప్రస్తుతం హాలీవుడ్‌లో హాట్‌హాట్‌గా దుమారం రేపుతున్నది. హాలీవుడ్ తెరపై తన అందచందాలతో ప్రేక్షకులనే కాదు.. హీరో విన్ డీజీల్ కట్టిపడేసింది. ఫలితంగా దీపికతో విన్ డీజిల్ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు. ప్రస్తుతం ఆయన నోటి వెంట దీపికా నామస్మరణే తప్ప మరోటి వినిపించడం లేదంటే అతిశయోక్తి కాదేమో. అదే విషయాన్ని ఇటీవల దీపికా ది ఎలెన్ డి జెనెరెస్ షోలో మాట్లాడుతూ.. ఈ విషయంపై స్పష్టత ఇచ్చింది.

రణ్‌వీర్‌కు గుడ్‌బై..

రణ్‌వీర్‌కు గుడ్‌బై..

బాలీవుడ్‌లో హీరో రణ్‌వీర్ సింగ్‌తో దీపికా ప్రేమాయణం సంచలనం రేపింది. ఎక్కడికెళ్లినా ప్రేమపక్షుల్లా వాలిపోయేవారు. వరుసగా రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం పద్మావతి చిత్రంలో నటిస్తున్నారు. అయితే హాలీవుడ్‌కు వెళ్లి త్రిబుల్ ఎక్స్ రిటర్న్ ఆఫ్ ఎక్సాండెర్ చిత్రంలో విన్ డిజిల్ తో నటించిన తర్వాత రణ్‌వీర్, దీపికకు దూరం పెరిగింది. అందుకు కారణం విన్ డీజిల్, దీపికాల మధ్య కెమిస్ట్రే కారణం.

పీకల్లోతు ప్రేమలో విన్ డిజిల్

పీకల్లోతు ప్రేమలో విన్ డిజిల్

విన్ డిజిల్‌ నాతో ప్రేమలో పడిపోయాడు. అతడు అంటే కూడా నాకు ఇష్టమే. మేమిద్దరం అన్యోన్యంగా ఉంటున్నాం అని దీపిక చెప్పగానే అభిమానుల గుండెలు ఒక్కసారిగా పగిలిపోయాయి. ఇక రణ్‌వీర్ సింగ్ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. న్యూ ఇయర్ వేడుక కోసం దుబాయ్ వెళ్లిన దీపిక, రణ్‌వీర్ సింగ్ అక్కడ గొడవపడినట్టు సమాచారం. దాంతో రణ్‌వీర్ ఇండియాకు ఒక్కడే తిరిగి రాగా, విన్ డిజిల్‌తో దీపిక అక్కడే ఉండిపోయినట్టు తెలిసింది.

నా మనసంతా విన్ డిజిల్

నా మనసంతా విన్ డిజిల్

తాజాగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో దీపిక మీడియాతో మాట్లాడుతూ.. నా మనసంతా విన్ డిజిల్‌ నిండి ఉన్నాడు. బుర్ర నిండా అతడి ఆలోచనలే. అతడి పరిస్థితి అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. మేమిద్దరం కలిసే ఉంటున్నాం. మా ఇద్దరి కెమిస్ట్రీ బాగా పండుతున్నది. మా ఇద్దరికి పిల్లలు కూడా ఉన్నారు కానీ అది ఆలోచనల్లోనే అని దీపిక చెప్పడం అభిమానులను కంగు తినిపించింది.

విన్ డిజిల్ అద్భుతమైన వ్యక్తి..

విన్ డిజిల్ అద్భుతమైన వ్యక్తి..

విన్ డిజిల్ నాతో పూర్తిగా ప్రేమలో మునిగిపోయాడు. అతడు అద్భుతమైన వ్యక్తి. ఇప్పటివరకు నా జీవితంలో విన్ లాంటి వ్యక్తిని కలుసుకోలేదు. చాలా నిజాయితీ పరుడు. ఇటీవల కాలంలో అతడితో మంచి, మరిచిపోలేనటువంటి అనుభవాలు ఎదురయ్యాయి. నా టాలెంట్‌పై మంచి నమ్మకం ఉన్న వ్యక్తి అతను. నేను ఎలాంటి సినిమాలను ఎంచుకోవాలనే విషయంలో సలహాలు, సూచనలు ఇస్తుంటాడు. నా జీవితంలో దొరికిన గొప్ప స్నేహితుడిగా కూడా అని విన్ డిజిల్‌పై దీపిక ప్రశంసల జల్లు కురిపించింది.

విన్ డిజిల్ ఇప్పుడు..

విన్ డిజిల్ ఇప్పుడు..

హాలీవుడ్‌లో దీపిక కెరీర్‌ను గొప్పగా మలిచే బాధ్యతను విన్ డిజిల్ భుజాన వేసుకొన్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. దీపికకు వచ్చే అన్ని సినిమాల స్క్రిప్టులను పరిశీలించే పీఆర్వో పనిని కూడా అతడే చేస్తున్నట్టు సమాచారం. త్రిబుల్ ఎక్స్ రిటర్న్ ఆఫ్ ఎక్సాండర్ కేజ్ సినిమా తర్వాత ఇప్పటివరకు హాలీవుడ్‌లో దీపికా ఏ ఒక్క సినిమా చేసిన దాఖలాలు లేవు. ప్రస్తుతం కేవలం సంజయ్ లీలా భన్సాలీ రూపొందిస్తున్న పద్మావతి చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రంలో రణ్‌వీర్, షాహీద్ కపూర్ కథానాయకులు అన్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X