టీనేజి బాయ్ ప్రెండ్‌తో డేటింగ్ చేస్తున్న హీరోయిన్
డెల్టా గూడ్రెమ్ ఆస్టేలియాలో పేరుమోసిన సింగర్, ఆ తర్వాత హీరోయిన్. తన సొంతదేశం ఆస్ట్రేలియాలో తను రూపోందించిన ఎనిమిది సింగిల్ ఆల్బమ్స్ తనకి మంచి పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టాయి. ఒకానోక సమయంలో తాను రూపోందించిన ఆల్బమ్స్ ఎక్కువగా అమ్ముడుపోయి రికార్డుని కూడా నెలకొల్పాయని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. డెల్టా గూడ్రెమ్ ముఖ్యంగా పాప్, అడల్డ్ కాంటెంపరరీకి స్టియల్స్‌కి ప్రసిద్ది. అలాంటి డెల్టా గూడ్రెమ్ ఇటీవల కాలంలో ప్రేమలో పడింది. ఎవరితో అని అనుకుంటున్నారా తనకంటే వయసులో చాలా చిన్నవాడైన నైక్ జోన్స్ అనే టీనేజర్. ప్రేమలో పడడమే కాకుండా ఈ ప్రేమ కాస్త బాగా ముదిరి రోమాన్స్ వరకు వెళుతున్నట్లు సమాచారం.
అసలు వీరిద్దరి మద్య పరిచయం ఎలా మొదలైంది అంటే డెల్టా గూడ్రెమ్ ఒకసారి లాస్ ఏంజిల్స్‌లోని సెంచురీ సిటీ పార్క్ కి తన ఫెర్పామెన్స్ ఇవ్వడానికి వచ్చినప్పుడు నైక్ జోన్స్ ఆమె పాటను విని ఆమెకి పెద్ద ఫ్యాన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇద్దరూ మే నెలలో హాలీవుడ్ రెస్టారెంట్‌లో కలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత నుండి వీరిద్దరి మద్య బాగా సాన్నిహిత్యం పెరిగిపోయింది. ఆ సాన్నిహిత్యం ఎక్కడి వరకు వెళ్శిదంటే వాల్ డిస్నీ హాల్ లోని మ్యూజికల్ లెస్ మిజరబుల్‌లో ఇద్దరూ కలిసి డేట్‌ని షేర్ చేసుకునేంతగా..
అంతక ముందు ఇద్దరూ కలసి భోజనాన్ని వారి స్నేహితులతో పంచుకోవడం జరిగింది. అక్కడున్న వారంతా వీళ్శను చూసి డెల్టా గూడ్రెమ్‌కి వీరిద్దరి మద్య ఉన్న వయసు ప్రాబ్లమ్ అవుతుందని అనుకోవడం జరిగింది. ఇంతకీ వీరిద్దరి వయసు ఎంత అని అనుకుంటున్నారా.. డెల్టా గూడ్రెమ్ వయసు కేవలం 26, ఆమె బాయ్ ప్రెండ్ నైక్ జోన్స్ వయసు కేవలం 18 మాత్రమే.. ఇదేంటి ఇంత వయసు ఉన్న సింగర్ మనవాడితో ఎలా ప్రెండ్ షిప్ చేస్తుందని ఆశ్చర్స పోకండి.. ఇదంతా జరిగేది హాలీవుడ్‌లో.. మనకు అంటే ఆశ్చర్యం కానీ అక్కడ అవన్నీ మామూలే.


Click it and Unblock the Notifications











