twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మేకప్ లేని ఇమేజిని ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన హీరోయిన్

    By Nageswara Rao
    |

    హాలీవుడ్ సింగర్, హీరోయిన్ డెమి లోవాటా ట్విట్టర్ పేజిలో మేకప్ లేనటువంటి ఇమేజిని పోస్ట్ చేశారు. ఇమేజిని పోస్ట్ చేసిన తర్వాత ఇమేజి క్రింద 'నో మేకప్! గుడ్ నైట్' అంటూ మేసేజ్‌ని పోస్ట్ చేసింది. తన ట్విట్టర్‌లో ఎన్నడూ లేనిది ఇలా మేకప్ లేని ఇమేజిని పోస్ట్ చేయడానికి గల కారణాన్ని వెల్లడిస్తూ మహిళలు స్వతంత్రంగా కూడా జీవించ గలుగుతారనే చూపించడానికేనని అన్నారు. ఎప్పుడైనా అవతలి వ్యక్తిని ప్రేమించేందుకు ముందు మొదటగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం తెలుసుకోవాలని అన్నారు.

    గతంలో తాను అనుభవించిన కొన్ని ఇబ్బందులు తన ముఖంలో ఎక్కడా కనిపించకుండా ఎప్పుడూ హుందాగా కనిపించే డెమి లోవాటా తాను ప్రస్తుతం సంతోషంగా ఉన్నానని అన్నారు. సాధారణంగా నేను కెమెరాస్ ముందు ఒకింత అసహానానికి గురి అవుతుంటాను. కొన్ని కొన్ని విషయాలను వెల్లడించడానికి తెగ ఇబ్బంది పడిపోతాను. కానీ కొంతకాలం కెమెరాల చుట్టూ ఉంటే నేను మరింత సౌకర్యవంతమైన ఉంటానని అన్నారు.

    గత అక్టోబర్‌లో తన శరీరంలో వచ్చినటువంటి కొన్ని ఫిజికల్ ప్రాబ్లమ్స్‌కి డెమి లోవాటా మెడికల్ ట్రీట్‌మెంట్ కోసం రిహాబ్‌కి వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సందర్బంలో కిమ్ కర్దాషియాన్ నా గురించిన సమాచారం నా అభిమానులకు ట్విట్టర్ ద్వారా అందజేయడం జరిగింది.

    అంతేకాకుండా నేను ట్రీట్‌మెంట్‌‌కి వెళ్లినప్పుడు త్వరగా కొలుకొవాలని అభిమానులు ప్రార్దన కూడా చేశారు. డెమి లోవాటా మెడికల్ ట్రీట్ మెంట్‌కి వెళ్లడానకి గల కారణం తినే తిండిలో కొంచెం మార్పులు ఒక కారణం కాగా, మరో కారణం పర్సనల్ ప్రాబ్లమ్స్‌గా డాక్టర్స్ అభివర్ణించడం జరిగింది. ఆ తర్వాత రిహాబ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత డెమి లోవాటా జీవితంలో నేను రిహాబ్‌లో ఉన్న కొన్ని నెలలు నాకు చీకటి రోజులుగా ఉండిపోయాయని తన అభిమానులతో చెప్పారు.

    English summary
    Singer-actress Demi Lovato has posted a picture of herself without any makeup on her Twitter page.
 She posted the picture with the message, “No makeup! Goodnight.”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X