Don't Miss!
- News KTR: రాముడిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ముగ్గురం కలిసి శృంగారం.. ఆ రతి చర్య తప్పే.. పెళ్లికాకుండానే ప్రెగ్నెంట్ అయ్యా..
హాలీవుడ్ యాక్టర్ డెమీ మూర్ తన జీవితంలోని భయంకరమైన విషయాలను బయటపెట్టింది. తాజాగా రాసిన తన ఆత్మకథ ఇన్సైడ్ అవుట్ పుస్తకంలో సంచలన విషయాలను వెల్లడించింది. తన లైఫ్‌లో విషాద సంఘటనలను, అలాగే భర్త చేసిన దుర్మార్గాలను తన ఆత్మకథలో పొందుపరిచింది. ఇంతకు తన భర్తపై డెమీ మూర్ చేసిన ఆరోపణలు ఏమిటంటే..
15 ఏళ్ల పెద్దవాడితో పెళ్లి
కెరీర్ మంచి జోష్ ఉండే సమయంలో తనకంటే చాలా పెద్దవాడైనా ఆష్టన్ కచ్చర్ అనే సీనియర్ నటుడిని పెళ్లాడింది. అప్పటికే వారి మధ్య 15 సంవత్సరాల గ్యాప్ ఉంది. దాదాపు 8 సంవత్సరాలపాటు కాపురం చేసి 2013లో విడాకులు తీసుకొన్నారు. వివాహేతర సంబంధాలు పెట్టుకొని పలు మార్లు చీటింగ్‌కు పాల్పడ్డారన్నారు. తమ దాంపత్య జీవితంలోకి మూడో వ్యక్తి రావడంతో రెండు సార్లు తీవ్ర మనో వేధనకు గురయ్యానని పేర్కొన్నారు.
ముగ్గురం కలిసి రతిచర్య
నా భర్త కచ్చర్తో మరో మహిళతో కలిసి శృంగారంలో పాల్గొన్నాను. కేవలం పడక గదిలో శృంగారం విషయంలో నేను ఎంత గొప్పగా ఉంటానో అని చెప్పడానికే ముగ్గరం కలిసి రతి చర్యలో పాల్గొన్నాం. అయితే అలా నా భర్తతోపాటు మరో మహిళతో కలిసి రతిలో పాల్గొనడం తప్పేనని డెమీమూర్ ఒప్పుకొన్నారు.
పెళ్లి కాకముందే ప్రెగ్నెంట్
కచ్చర్తో పెళ్లికాక ముందు మేమిద్దరం డేటింగ్ చేశాం. ఆ సమయంలో నేను ప్రెగ్నెంట్ అయ్యాను. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు చాప్లిన్ రే అని పేరు పెట్టాలని కూడా అనుకొన్నాను. కానీ ఆరు నెలల గర్భం విచ్చిన్నం కావడంతో విషాదానికి గురయ్యాను. అందుకు కారణం విపరీతంగా డ్రగ్స్, ఆల్కాహాల్ తీసుకోవడమే అని డెమీ మూర్ పేర్కొన్నారు.
కచ్చర్కు గుడ్‌బై చెప్పి
కచ్చర్తో వైవాహిక జీవితంలో సంతానం కోసం చాలా సార్లు ప్రయత్నించాను. కానీ సక్సెస్ కాలేదు. ఆ తర్వాత నేను కచ్చర్తో విడాకులు తీసుకొన్నాను. ఆ తర్వాత అప్పటికే ఇద్దరు సంతానం ఉన్న నటుడు మిలా కునిస్ను పెళ్లి చేసుకొవాల్సి వచ్చిందని చెప్పారు. దట్స్ సెవెంటీస్ షో అనే చిత్రంలో వీరిద్దరి నటించారు. ఆ సమయంలోనే మిలాతో ప్రేమలో పడింది.