Don't Miss!
- Technology వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Sports KKR Playing XI: రూ. 24.75 కోట్ల ఆటగాడిపై వేటు! పంజాబ్‌తో తలపడే కేకేఆర్ తుది జట్టు ఇదే!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పౌరుడిని రౌండప్ చేసిన పోలీసులు.. అండగా నిలబడి రియల్ హీరో అనిపించుకున్న స్టార్
అసలే కరోనా కాలం. అందర్నీ అనుమానంతో చూస్తుంటారు. కరోనాను కట్టడి చేసేందుకు పకడ్బంధీగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. ప్రపంచంలో అమెరికా ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటుందే అందరికీ తెలిసింది. కరోనా కేసుల్లో, మరణాల్లో అగ్రరాజ్యం అమెరికానే అన్ని దేశాలకంటే ముందుంది. అలాంటి అమెరికాలో లాక్ డౌన్‌ను కూడా కఠినంగా అమలుపరుస్తున్నారు. అయినా కరోనా మాత్రం కంట్రోల్లో ఉండటం లేదు. తాజాగా అక్కడి ఓ సాధారణ పౌరుడికి, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.
సాధారణ పౌరుడు అనుమానాస్పదంగా కనబడటంతో పోలీసులు చుట్టుముట్టారు. అయితే ఆ వ్యవహారం ఏదో తేడా కొడుతోందని అటు వైపుగా వచ్చిన హాలీవుడ్ స్టార్ డెంజిల్ వాషింగ్టన్ కారు దిగి అక్కడి పరిస్థితిపై ఆరా తీశాడు. అంతేకాకుండా వ్యవహారం పూర్తిగా సద్దుమణిగే వరకు అక్కడే ఉన్నాడు. చివరకు ఆ పౌరుడికి హాని కలగకుండా, పోలీసులు మర్యాదగా ప్రవర్తిస్తూ అరెస్ట్ చేసేలా చూశాడు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ మేరకు డెంజిల్ వాషింగ్టన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రియల్ హీరో, గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రెండు సార్లు అకాడమీ అవార్డ్స్ అందుకున్న డెంజిల్ ఎన్నో అంతర్జాతీయ వేదికలపై ప్రతిష్టాత్మకమ అవార్డులను అందుకున్నాడు. ఈయన కెరీర్లో ది ఈక్విలైజర్, ట్రెయినింగ్ డే, ఫ్లైట్, ది ఈక్విలైజర్ 2, మ్యాన్ ఆన్ ఫైర్ వంటి గొప్ప చిత్రాలెన్నో ఉన్నాయి.