అత్యధిక పారితోషికం పొందే హీరో ఎవరంటే..!!

By Kuladeep

హాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక పారితోషికం తీసుకొనే కథానాయకుడుగా 'కెప్టెన్ జాక్ స్పారో' గా ప్రసిద్ధి చెందిన జానీ డెప్ చరిత్ర సృష్టించాడు. త్వరలో విడుదల కానున్న 'పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్: ఆన్ స్ట్రేంజర్స్ టైడ్స్' సినిమాలో నటించడానికి ఏకంగా 33 మిలియన్ పౌండ్లు పారితోషికంగా పొందాడు. ఈ మొత్తం హాలీవుడ్ ఎ-లిస్ట్ స్టార్స్ టామ్ క్రూజ్, విల్ స్మిత్, హారిసన్ ఫోర్డ్ ల పారితోషికానికి రెట్టింపు కావడం గమనార్హం.

పారితోషికంగా తక్కువే డిమాండ్ చేసిన జానీ డెప్ సినిమా లాభాల్లో వాటా అడిగాడట. తొలుత దీనిపై ఆలోచించిన డిస్నీ పిక్చర్స్ నిర్మాతలు, ఆ తర్వాత జానీ డెప్ లేకపోతే పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ సీరీస్ కు ఆశించినంత విలువ ఉండదని భావించి ఆయన డిమాండ్ లకు తలొగ్గారంట. దీంతో జానీ డెప్ హాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక పారితోషికం పొందిన హీరోగా చరిత్ర సృష్టించాడు. కాగా ఈ 'పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్: ఆన్ స్ట్రేంజర్స్ టైడ్స్' సినిమా 2011 వేసవిలో విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X