బ్రిటన్‌లో ఖరీదైన బిల్డింగ్‌ని సొంతం చేసుకున్నా..!
పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ సినిమాల ద్వారా తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్న హాలీవుడ్ స్టార్ హీరో జానీ డెప్ 6.25 మిలియన్ పౌండ్లువిలువ కలిగిన ఓ దేశీయ ఎస్టేట్ నార్ఫోక్లో 'బర్న్హమ్ వెస్ట్‌గేట్ హాల్'ని బ్రిటన్‌లో కొనుగోలు చేశాడని లైఫ్ & స్టయిల్ మ్యాగజైన్ ప్రచురించింది. ఈ ఎస్టేట్‌ని 1750లో నిర్మించిగా, ఇందులో 13 బెడ్ రూములతో పాటుగా..12 బాత్ రూమ్స్ ఉన్నాయి.
వీటితో పాటు జానీ డెప్ వెస్ట్ హాలీవుడ్, ప్లాన్ డే లా టూర్, ఫ్రాన్స్‌లలో ఇళ్లుని కలిగి ఉన్నాడు. బహామ్మాస్‌లో ఓ ప్రయివేట్ ఐలాండ్‌ని కూడా కలిగి ఉన్నాడు. ది టూరిస్ట్ అనే సినిమాలో ఏంజిలినా జోలీతోపాటు హీరోగా పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ స్టార్ జానీ డెప్ నటించారు. ఈ సినిమా 2010వ సంవత్సరంలో విడుదలైన బాక్సాఫీసు కలెక్షన్స్‌ని వసూలు చేసింది. ది టూరిస్ట్ సినిమాకు సంబంధించి సింహాభాగం మొత్తం షూటింగు ఇటలీలోనే తీయడం జరిగింది.
ఏంజిలినా జోలీ మాట్లాడుతూ జానీడెప్ లాంటి ఎక్ట్రాఆర్డినరీ హీరోతో రెండు నెలలుపాటు ఇటలీలో షూటింగ్ వదులుకోవడం ఇష్టం లేకనే నేను అతనితో ది టూరిస్ట్ సినిమాలో నటించడానికి అంగీకరించాను అన్నారు. నాకు చాలా మంది హీరోయిన్లు అలా రెండు నెలలు పాటు ఒకే హీరోతో షూటింగ్ చేయడానికి ఇష్టపడరు అన్నారు. కానీ జానీడెప్‌తో నటిస్తుంటే చాలా సరదాగా, ప్రేమగా ఉంటుందన్నారు. అందుకే నేను అతను నన్ను ఈసినిమాలో మీరు నటించాలి అని అడగగానే వెంటనే ఒప్పుకున్నానని అన్నారు.


Click it and Unblock the Notifications











