హాలీవుడ్ తార ఏంజలీనా జోలీ ఆత్మహత్యాయత్నం..!!
ప్రముఖ హాలీవుడ్ నటి సూపర్ స్టార్ ఏంజలీనా జోలీ ఆత్మహత్యాయత్నం చేసింది. ఏంటీ..?? ఎప్పుడు..?? ఇప్పుడు ఎలా వుంది..?? అని ఖంగారుపడిపోతున్నారా...!! ఆగండాగండి. జోలీ ఆత్మహత్యాయత్నం చేసింది నిజమే కానీ ఇప్పుడు కాదు తను చిన్న వయసులో వున్నప్పుడు. నేషనల్ ఎంక్వయిరర్ మ్యాగ్జయిన్ కథనం ప్రకారం జోలీ తన యుక్త వయసులో వున్నప్పుడు పూర్తిగా డిప్రెషన్ లో పడిపోయి ఆత్మహత్యాయత్నం చేసిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమే వెళ్లడించిందట.
విశ్వసనీయ కథనం ప్రకారం బ్రాడ్ పిట్ తనని వదిలేసి తనదారిన వెళ్లిపోనున్నాడనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఫ్రాన్స్ లో వున్న బ్రాడ్ కు ఫోన్ చేసిన ఏంజలీనా జోలీ తనకు చిన్నతనంలో జీవితం విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించానని, నువ్వు దగ్గర లేనప్పుడు నాకు ఏమీ తోచదని తిరిగి అలాంటి చెడు ఆలోచనలు వస్తున్నాయని, నువ్వు లేక పోతే చనిపోవాలని అనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేసిందట. దీంతో వెంటనే బ్రాడ్ ఆమెను ఊరడించి నీ కోసం, మన పిల్లల కోసం నేనెప్పుడూ నీకు తోడుగా వుంటానని ప్రమాణం చేసాడట. అదీ సంగతి..!!
కానీ ఇది విన్న కొందరు జోలీ ఎక్కడ బ్రాడ్ తనని వదిలేసి వెళ్లిపోనున్నాడో అని సెంటిమెంటల్ బ్లాక్ మెలింగ్ కు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. కాగా వీరిద్దరూ మరో 18 నెలల్లో విడిపోనున్నారని 'బ్రాంజలీనా' పుస్తకం ప్రముఖ రచయిత హాల్పెరిన్ వెళ్లడించిన సంగతి తెలిసిందే. ఈ వార్త అప్పట్లో సంచలనం సృష్టించింది.


Click it and Unblock the Notifications











