ఆ సినిమా హై హీల్స్ అనుభవం వల్లనే ఈజీగా చేశా: అన్నేహాత్వే
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ దేవకన్యగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న అన్నేహాత్వే 'ది డార్క్ నైట్ రైజెస్' సినిమాలో క్యాట్ ఉమెన్‌గా నటిస్తున్న తీరు అద్బుతంగా ఉందంటూ ఆ సినిమా దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ కితాబిస్తున్నాడు. ఈ విషయంపై అన్నేహాత్వేని సంప్రదించగా.. క్యాట్ ఉమెన్‌గా అద్బుతంగా నటించడానికి కారణం గతంలో తాను నటించిన 'ద డెవిల్ వేర్స్ ప్రాడా' సినిమానే స్పూర్తి అని అన్నారు.
29 సంవత్సరాల వయసు కలిగిన అన్నేహాత్వే మాట్లాడుతూ 'ద డెవిల్ వేర్స్ ప్రాడా' సినిమాలో 'మిరందా ప్రెస్టీ' అనే మ్యాగజైన్ ఎడిటర్ అసిస్టెంట్ పాత్రలో హై హీల్స్ వేసుకోని బిజీగా కనిపిస్తూ తిరిగడంతో క్యాట్ ఉమెన్ గా హైహీల్స్ విషయంలో తాను ఎటువంటి ఇబ్బందిని ఎదుర్కోనలేదని అన్నారు.
హై హీల్స్ వేసుకోని ఎలా నడవాలో 'ద డెవిల్ వేర్స్ ప్రాడా' సినిమా కోసం చక్కని ట్రైనింగ్ తీసుకున్నాను. హై హీల్స్ వేసుకోని కిక్స్, జంపింగ్స్ ఎలా చేయాలో ఆ సినిమాలో చక్కగా ప్రాక్టీస్ చేశాను. ఇది నాకు ఎంతగానో ఉపయోగపడిందని తెలిపారు. 'ది డార్క్ నైట్ రైజెస్' సినిమాలో క్యాట్ ఉమెన్‌గా నేను ఎన్నో స్టంట్స్ చేయాల్సి వచ్చింది. అవన్నీ కూడా హై హీల్స్ మీద ఉండడం విశేషం.
గతంలో హై హీల్స్ వేసుకున్న అనుభవం ఉండడంతో ఈజీగా అలాంటి స్టంట్స్ చేయగలిగానని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 'ది డార్క్ నైట్ రైజెస్' సినిమా జులై 20వ తారీఖున విడుదల కానుంది. ఈ సినిమాలో అన్నే హాత్వేతో పాటు క్రిస్టియన్ బేల్, గ్యారీ ఓల్డ్ మ్యాన్, జోసెఫ్ గోర్డాన్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి జోనాథన్ నోలన్, క్రిస్టోఫర్ నోలన్ స్క్రీన్ ప్లేని అందించారు.


Click it and Unblock the Notifications











