twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దటీజ్ ధనుష్.. అవేంజర్స్ దర్శకులతో కోలీవుడ్ స్టార్

    |

    కోలీవుడ్ స్టార్‌ హీరో ధనుష్ యాక్టింగ్ ఖండాంతరాలు దాటేసింది. కోలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ధనుష్ ప్రయాణం సాగింది. ఇంతకు ముందు ఓ ఇంటర్నేషనల్ సినిమాలో నటించాడు. 2018లో వచ్చిన 'ది ఎక్ట్స్రాడినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్‌' చిత్రంలో నటించి సత్తా చాటుకున్నాడు. మన వరకు వస్తే కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని చోట్లా ధనుష్ ఫాలోయింగ్ గట్టిగానే ఉంది.

    ఓ వైపు మాస్ అండ్ కమర్షియల్ సినిమాలు చేస్తూనే.. కథ, నటనకు ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటిస్తుంటాడు. చివరగా ధనుష్ నటించిన అసురన్ చిత్రం దేశవ్యాప్తంగా ప్రశంసలను దక్కించుకుంది. అసురన్ మూవీతో ధనుష్ తనలోని మరో కోణాన్ని బయటపెట్టేశాడు. ధనుష్ నటనపై అన్ని వర్గాల ప్రేక్షకులు, విమర్శకులు ప్రశంసలు కురిపించారు. తాజాగా ధనుష్ మరోసారి హాలీవుడ్ చిత్రంలో నటించనున్నాడు.

     Dhanush In russo brothers The Grey Man

    'అవెంజర్స్‌'తో పాపులర్‌ అయిన రస్సో బ్రదర్స్‌ 'ది గ్రే మ్యాన్' అనే చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. దీనికి సంబంధించిన నటీనటుల పేర్లను చిత్రబృందం విడుదల చేసింది. అందులో ధనుష్‌ కూడా నటించనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ధనుష్ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన అభిమానులు చూపించే ప్రేమకు ధన్యవాదాలు తెలిపాడు.

    English summary
    Dhanush In russo brothers The Grey Man, Dhanush In russo brothers Direction.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X