Don't Miss!
- News వైసీపీ అభ్యర్థికి జగన్ బంపర్ ఆఫర్.. పులివెందుల నుంచి పోటీ చేయలంటూ సూచన
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Sports సూపర్ సండే: సునామీ సన్‌రైజర్స్‌ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్‌లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్‌ప్రైడే రోజున లాంగ్‌వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్‌లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
దటీజ్ ధనుష్.. అవేంజర్స్ దర్శకులతో కోలీవుడ్ స్టార్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ యాక్టింగ్ ఖండాంతరాలు దాటేసింది. కోలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ధనుష్ ప్రయాణం సాగింది. ఇంతకు ముందు ఓ ఇంటర్నేషనల్ సినిమాలో నటించాడు. 2018లో వచ్చిన 'ది ఎక్ట్స్రాడినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్' చిత్రంలో నటించి సత్తా చాటుకున్నాడు. మన వరకు వస్తే కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని చోట్లా ధనుష్ ఫాలోయింగ్ గట్టిగానే ఉంది.
ఓ వైపు మాస్ అండ్ కమర్షియల్ సినిమాలు చేస్తూనే.. కథ, నటనకు ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటిస్తుంటాడు. చివరగా ధనుష్ నటించిన అసురన్ చిత్రం దేశవ్యాప్తంగా ప్రశంసలను దక్కించుకుంది. అసురన్ మూవీతో ధనుష్ తనలోని మరో కోణాన్ని బయటపెట్టేశాడు. ధనుష్ నటనపై అన్ని వర్గాల ప్రేక్షకులు, విమర్శకులు ప్రశంసలు కురిపించారు. తాజాగా ధనుష్ మరోసారి హాలీవుడ్ చిత్రంలో నటించనున్నాడు.
'అవెంజర్స్'తో పాపులర్ అయిన రస్సో బ్రదర్స్ 'ది గ్రే మ్యాన్' అనే చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. దీనికి సంబంధించిన నటీనటుల పేర్లను చిత్రబృందం విడుదల చేసింది. అందులో ధనుష్ కూడా నటించనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ధనుష్ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన అభిమానులు చూపించే ప్రేమకు ధన్యవాదాలు తెలిపాడు.