»   »  హాలీవుడ్ చిత్రంలో హీరోగా ధనుష్, పూర్తి వివరాలు...

హాలీవుడ్ చిత్రంలో హీరోగా ధనుష్, పూర్తి వివరాలు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌత్ స్టార్లలో ఒకరైన ధనుష్ హాలీవుడ్ ప్రాజెక్టులో హీరోగా నటించబోతున్నాడు. ఇప్పటికే సౌత్ లో అతిపెద్ద సినిమా ఇండస్ట్రీలైన తెలుగు, తమిళంలో స్టార్ హీరోగా ఇమేజ్ సొంతం చేసుకున్న ధనుష్... బాలీవుడ్లో రెండు మూడు సినిమాలు చేసి తన నటనతో హిందీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇపుడు ఇంటర్నేషనల్ ప్రాజెక్టులో భాగం కాబోతున్నాడు.

‘ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ఎ ఫకిర్ హూ గాట్ ట్రాప్డ్ ఇన్ ఆన్ ఐకియా కప్‌బోర్డ్' అనే హాలీవుడ్ చిత్రంలో ధనుష్ హీరోగా నటిస్తున్నాడు. ఇరానియన్-ఫ్రెంచి ఫిల్మ్ మేకర్ మర్జానే సత్రాపి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ధనుష్ సరసన ఉమా తుర్మన్, అలెగ్జాండ్రా దడ్డారియో(సాన్ ఆండ్రియాస్ ఫేం) నటిస్తున్నారు.

 Dhanush's Hollywood Debut confirmed

మీ హాలీవుడ్ ప్రాజెక్టులో ధనుష్‌ను హీరోగా ఎందకు ఎంచుకున్నారు? అనే ప్రశ్నకు దర్శకురాలు స్పందిస్తూ...‘నేను రకరకాల ఇండియన్ మూవీస్ చూసాను. నేను ఎంచుకున్న స్క్రిప్టుకు ధనుష్ బెస్ట్ చాయిస్ అనిపించింది. అతని ఇంటెలిజన్స్ యాక్టింగ్, కిల్లర్ స్మైల్, ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయగలిగే టాలెంట్ వల్ల అతన్ని హీరోగా ఎంచుకున్నాను' అని తెలిపారు.

2016వ సంవత్సరం కొందరు ఇండియన్ స్టార్లకు హాలీవుడ్ అవకాశాల పరంగా బాగా కలిసొచ్చేట్లు కనిపిస్తోంది. ఇప్పటికే హీరోయిన్ దీపిక పదుకోన్ ‘XXX' అనే హాలీవుడ్ చిత్రంలో హీరోయిన్ గా ఖరారైన సంగతి తెలిసిందే. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ స్టార్ విన్ డీసెల్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దీపిక హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమెతో పాటు ప్రియాంక చోప్రా ‘బేవాచ్' అనే ప్రాజెక్టుకు ఎంపికైంది. ఇపుడు ధనుష్ కూడా హాలీవుడ్ ప్రాజెక్టుకు సెలక్ట్ అయ్యాడు. ఈ ఇండియన్ స్టార్స్ అంతా హాలీవుడ్లో సత్తా చాటాలని బెస్టాఫ్ లక్ చెబుదాం....

English summary
Tamil star Dhanush is all set to star in his first international project. Reportedly, Dhanush plays lead role in the movie 'The Extraordinary Journey of a Fakir who got trapped in an Ikea Cupboard' to be directed by Marjane Satrapi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu