twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ధనుష్ హాలీవుడ్ సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది: హాలీవుడ్‌లోకి ధనుష్ తొలి అడుగు

    |

    రొమేనియా న‌వ‌ల ఫ్యూర్‌టోల‌స్ ఆధారంగా ద ఎక్స్‌ట్రాడిన‌రీ జ‌ర్నీ ఆఫ్ ద ఫ‌కిర్ చిత్రాన్ని హాలీవుడ్‌లో నిర్మించారు. కెన్ స్కాట్స్ ఈ చిత్రానికి డైరెక్ట‌ర్‌. ఇది కామెడీ-అడ్వెంచ‌ర్ చిత్రం. ఈ చిత్రంలో భార‌తీయ న‌టుడు ధ‌నుష్ న‌టించ‌డం విశేషం. ధ‌నుష్‌తో పాటు బెరినిక్ బెజో, బార్‌ఖ‌డ్ అబ్ది, ఎరిన్ మోరియార్టి, అబుల్ జ‌ఫ్రీ న‌టిస్తున్నారు. ధనుష్ కొత్తలో పెద్దగా విజయాలు సాధించకపోయినా చిన్న చిన్నగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు మంచి కమర్షియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతే కాదు దనుష్ బాలీవుడ్ లో కూడా రెండు సినిమాలు తీసి అక్కడ కూడా మంచి ఇమేజ్ సంపాదించాడు.

     హాలీవుడ్‌లో ధనుష్ హీరోగా

    హాలీవుడ్‌లో ధనుష్ హీరోగా

    తాజాగా ధనుష్ హాలీవుడ్ కు పరిచయం కాబోతున్నాడు. రెండేళ్ళ కిందట తమిళంలో ధనుష్ హీరోగా 'మరియన్' అనే మూవీ వచ్చింది. ఆ చిత్రంలో ధనుష్ పెర్ఫార్మెన్స్ చూసి ధనుష్ కు హాలీవుడ్ మూవీకు సెలెక్ట్ చేశారు. హాలీవుడ్‌లో ధనుష్ హీరోగా ఒక సినిమా తెరకెక్కనుంది.

    ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ద ఫాకిర్

    ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ద ఫాకిర్

    ఈ సినిమాకు 'ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ద ఫకిర్: హు గాట్ ట్రాప్డ్ ఇన్ యన్ ఇకియా కప్ బోర్డ్' అనే టైటిల్ పెట్టారు. ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ ఉమా తుర్మన్ ఈ మూవీలో ధనుష్ సరసన నటిస్తోంది. అంటూ గత సంవత్సరమే వార్తలు వచ్చాయ్ కానీ తర్వాత మళ్ళీ మొత్తం సైలెంట్ అయిపోయింది.

     మొదటి దర్శకుడు మర్జానే సత్రాపి

    మొదటి దర్శకుడు మర్జానే సత్రాపి

    ఊహించని విధంగా ప్రి ప్రొడక్షన్ దశలోనే ఉన్నట్లుండి దీని మొదటి దర్శకుడు మర్జానే సత్రాపి ఈ సినిమా నుంచి తప్పుకోవటం తో కొన్నళ్ళు అసలు ఈ సినిమా వస్తుందా రాదా అని అయోమయం లో పడ్డారు. ఆ ఊహలన్నిటినీ బ్రేక్ చేస్తూ ఇప్పుడు ఫస్ట్ లుక్ పోస్టర్ రావటంతో క్లారిటీ వచ్చింది.

     రూమర్స్ అనుకున్నారు

    రూమర్స్ అనుకున్నారు

    ఆ తర్వాత మర్జానే సత్రాపి స్థానం లో కెన్ స్కాట్ వచ్చాడు. ఎవరు ఊహించని విధంగా హాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడు. గత కొంత కాలంగా ఈ వార్తలు వచ్చినా కొందరు రూమర్స్ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఫస్ట్ లుక్ పోస్టర్ ని చూస్తే నిజమని నమ్మాల్సిందే.

    ఇండియాకు చెందిన ఒక కళాకారుడిగా

    ఇండియాకు చెందిన ఒక కళాకారుడిగా

    ది ఎక్సట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకిర్ అనే సినిమాతో త్వరలోనే రాబోతున్నాడు ఈ సౌత్ హీరో. ధనుష్ ఈ సినిమాలో ఇండియాకు చెందిన ఒక కళాకారుడిగా 'అజా' అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ఇదే పేరుతో ఉన్న ప్రముఖ నవల ఆధారంగా కెన్ స్కాట్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

     తొలి ప్రమోషనల్ టీజర్

    తొలి ప్రమోషనల్ టీజర్

    ఈ సినిమాలో ప్రముఖ హాలీవుడ్ నటీనటులు కిల్ బిల్ నటి ఉమా థుర్మాన్ మరియు పెర్సీ జాక్సన్ లు నటిస్తున్నారు. అమెరికన్ ఫిల్మ్ మార్కెట్లో సినిమా తొలి ప్రమోషనల్ టీజర్ ను ప్రదర్శించగా హాలీవుడ్ చెందిన కొందరు ప్రముఖులు ఈ సినిమా హక్కులను పొందారు.

    English summary
    The first look from Dhanush’s Hollywood debut, The Extraordinary Journey of the Fakir, is out. However, in his slick blue suit, Dhanush looks nothing like a ‘fakir’.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X