కొత్త మోడల్‌తో డేటింగ్ మొదలు పెట్టిన సూపర్ హీరో
టైటానిక్ సినిమా ద్వారా ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకొవడమే కాకుండా, యావత్ ప్రపంచం మొత్తం తన సత్తాని చాటిన సూపర్ హీరో లియోనార్డో డికాప్రియో. స్వతహాగా అందగాడైన లియోనార్డో డికాప్రియో తన అందంతో ఎంతొ మంది అమ్మాయిలతో డేటింగ్ చేసిన సందర్బాలున్నాయి. గతంలో లియోనార్డో డికాప్రియోతో మోడల్స్ ఆల్సే క్రాఫోర్డ్, కెండాల్ స్క్రూలర్ రొమాన్స్ చేసిన వారే. ఇప్పుడు వీరి కొవలోకి మరో సూపర్ మోడల్ చేరింది.
లియోనార్డో డికాప్రియో ప్రస్తుతం 'మాడలినా జినియా' మోడల్‌తో డేటింగ్ చేస్తున్నట్లు హాలీవుడ్ కొడై కూస్తుంది. 36సంవత్సరాలు వయసు కలిగిన లియోనార్డో డికాప్రియో సిడ్నీలో 'ద గ్రేట్ గేట్స్ బై' అనే సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సందర్బంగా మాడలినా జినియా మాట్లాడుతూ డికాప్రియోతో సహావాసం ఎంతో ఎంజాయ్‌గా ఉందని తెలిపారు. ఆస్ట్రేలియాలో ఉన్న హార్బర్ బయట హోటల్‌లో ఇద్దరూ కలసి చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ షూటింగ్‌లో పాల్గోంటున్నట్లు సమాచారం.
డికాప్రియోతో మీకు ఎప్పటినుండి బంధం కొనసాగుతుందని ప్రశ్నించగా, సిడ్నీకి రాక ముందు మేమిద్దరం నాలుగు సార్లు కలుసుకున్నామని ఆస్టేలియా డైలీ టెలిగ్రాఫ్‌కి తెలిపారు.


Click it and Unblock the Notifications











