»   » వాలెంటైన్స్ డే రోజున నేనాపని చెయ్యలేదు..!!

వాలెంటైన్స్ డే రోజున నేనాపని చెయ్యలేదు..!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

అసలు హాలీవుడ్ లో ఎవరినెవరు ఎందుకు ఇష్టపడతారో ప్రేమిస్తారో ఎవ్వరికీ తెలియదు. ఓ రోజు కలసి తిరిగిన వారు మరో రోజు ఎడమొహం పెడమొహంగా వుంటారు. టైటానిక్ సినిమా ద్వారా పరిచయం అయిన కథానాయకుడు లినార్డినో డీ కాప్రియో కూడా ఇందుకేమీ మినహాయింపు కాదు. లినార్డినో డి కాప్రియో, తన ప్రియురాలు బార్ రెఫేలి తో మూడేళ్ల పాటు కలిసుండి గత ఏడాది జూన్ నెలలో విడిపోయాడు. ఆ తర్వాత ఆమెతో ఇటీవలే తిరిగి కలసిపోయాడు.

ఇక గత ఆదివారం నాడు జరిగిన వాలెంటైల్స్ డే రోజున లినార్డినో డీ కాప్రియో, తన ప్రియురాలు బార్ రెఫేలితో తన ప్రేమను వ్యక్తం చేసాడనే వార్తలు వచ్చాయి. కానీ లినార్డినో మాత్రం తను వాలెంటైన్స్ డే రోజున ఆ పని చెయ్యలేదని మొత్తుంకుంటున్నాడట. కానీ వీరిద్దరి సాన్నిహిత్యం గురింతి కథలుకథలుగా చెప్పుకుంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu