నా కాబోయే భార్య మా అమ్మలాగే పరిపూర్ణతతో ఉండాలి
టైటానిక్ సినిమా ద్వారా యావత్ ప్రపంచం మొత్తం అభిమానులను సొంతం చేసుకున్న స్టార్ హీరో లియోనార్డో డికాప్రియో ఇటీవల ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ తన జీవితంలోకి రాబోయే తన భార్య అచ్చం తన తల్లి మాదిరే ఉండాలని అన్నారు. ఇందుకు కారణం నా తల్లి ప్రతి విషయంలో సంపూర్ణంగా ఉండడమే కాకుండా అందరికి ఆదర్శ మహిళ అని అన్నారు.
ప్రస్తుతం లియోనార్డో డికాప్రియో మోడల్ 'ఎరిన్ హెర్తంగ్టన్' తో డేటింగ్ చేస్తున్నాడు. తాను డేటింగ్ చేసే ప్రతి గర్ల్ ప్రెండ్‌ని తన తల్లి మాదిరే అన్ని విషయాలలో పరిపూర్ణంగా ఉండడాన్ని తాను కోరుకుంటాడని అన్నాడు. ఈ సందర్బంలో తన తల్లి గురించి మాట్లాడుతూ నా తల్లి నా జీవితంలో కేంద్రంగా ఉంది. మీ జీవితంలో స్దిర పడబోయే పాట్నర్ మీతో నిజాయితీగా ఉంటూ మీకు చక్కని సహాకారాన్ని అందించే మహిళగా ఉండాలని అన్నారు.
ఇటీవలే సెలీనా గోమెజ్ టైటానిక్ స్టార్ హీరో లియోనార్డో డికాప్రియోతో కలసి నటించాలని ఇటీవలే తన మనసులోని కొరికను బయట పెట్టింది. ఈ సందర్బంలో సెలీనా గోమెజ్ మాట్లాడుతూ నాకు తెలిసి నన్ను లియోనార్డో డికాప్రియో పిలిచి తనతో వర్క్ చేయమని మాత్రం అడగకపోవచ్చు. కానీ నేను మాత్రం నా జీవితంలో ఒక్కసారైనా లియోనార్డో డికాప్రియోతో కలసి పని చేయాలని అనుకుంటున్నాను కాబట్టి ఏ సమయంలోనైనా నాఅంతట నేను ఆయనని నాతో కలసి వర్క్ చేయమని అడగాలని అనుకుంటున్నానని అన్నారు.


Click it and Unblock the Notifications











