యాక్షన్ ఎడ్వంచర్ ‘డై హార్డ్-5’
హైదరాబాద్ : యాక్షన్ ఎడ్వంచర్ చిత్రాలకు పెట్టింది పేరైన హాలీవుడ్ చిత్ర సీమ నుంచి మరో భారీ యాక్షన్ ఎడ్వంచర్ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గతం వచ్చిన డైహార్డ్ చిత్రం 4 సిరీస్‌లు మంచి విజయం సాధించిన నేపథ్యంలో తాజాగా 5వ భాగాన్ని 'ఎ గుడ్ డే టు డై హార్డ్' అనే పేరుతో రూపొందించారు. ఈచిత్రం అమెరికా, కెనడాల్లో ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఈ నెలాఖరుకు ఈ సినిమాను ఇండియాలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
హాలీవుడ్ స్టార్స్ బ్రూస్ విల్లీస్, జైకర్ ట్లీ నటించిన ఈ చిత్రానికి 'ది ఉమెన్' ఫేం డైరెక్టర్ జాన్ మూర్ దర్శకత్వం వహించారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ వారు ఈచిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈచిత్రాన్ని విడుదల చేస్తున్నారు. రష్యా అసాంఘీక శక్తుల చేతికి చిక్కిన తన కొడుకును హీరో ఎలా కాపాడుకున్నాడు అనేది ఈ సినిమా కథాంశం.
తెలుగులో ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. అవి పూర్తయిన తర్వాత సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే : స్కిప్ వుడ్స్, సంగీతం : మాక్కో బెల్ట్రామి, సినిమాటోగ్రఫీ : జొనాథన్ సేలా, నిర్మాతలు : అలెక్స్ యంగ్, పీటెర్ వెవెర్కా, దర్శకత్వం : జాన్ మూర్.

డైహార్డ్ 5 మూవీ స్టిల్స్

డైహార్డ్ 5 మూవీ స్టిల్స్

డైహార్డ్ 5 మూవీ స్టిల్స్

డైహార్డ్ 5 మూవీ స్టిల్స్

డైహార్డ్ 5 మూవీ స్టిల్స్


Click it and Unblock the Notifications











