అసాంఘిక శక్తులకు చిక్కిన కొడుకుని రక్షించుకున్న హీరో
లాస్ ఏంజిల్స్ : బ్రూస్ విల్లీస్ చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. దానకి తోడు జైకర్ ట్లీ వంటి మరో స్టార్ జతకూడితే ఆ క్రేజే వేరు. వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన 'డై హార్డ్-5'చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. 'డై హార్డ్' సిరీస్‌లో అయిదవ భాగంగా రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. బ్రూస్ విల్లీస్, జైకర్‌ట్లీ ప్రధాన పాత్రలు పోషించారు. 'ది ఉమెన్'ఫేం జాన్‌మూర్ దర్శకత్వం వహించారు.
కథ ప్రకారం రష్యాలోని అసాంఘిక శక్తులకు చిక్కి ప్రాణభీతితో కొట్టుమిట్టాడుతున్న తన తనయుడ్ని ఓ తండ్రి ఎలా కాపాడుకున్నాడు?
ఆ క్రమంలో ఎదుర్కొన్న ప్రాణాంతక సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడు? అనే ప్రశ్నలకు సమాధానంగా రూపొందిన హాలీవుడ్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదల అవుతోంది. ముఖ్యంగా డై హార్డ్ సీరిస్ కు సీక్వల్ కావటం కూడా ఈ సినిమాకు ఉన్న ప్లస్ పాయింట్.
ఫాక్స్‌స్టార్ స్టూడియోస్ ద్వారా తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో 2డీ వెర్షన్‌లో తెలుగునాట ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిథి మాట్లాడుతూ -''ప్రపంచవ్యాప్తంగా 'డై హార్డ్' సిరీస్‌కి అభిమానులు ఉన్నారు. వారి అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా ఉంటుంది. ఇందులోని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకుల్ని రోమాంచితుల్ని చేస్తాయి. అడ్వంచరస్ చిత్రాలను ప్రేమించే ప్రేక్షకులకు ఈ సినిమా ఓ విందుభోజనం. ఈ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేస్తాం'' అని తెలిపారు.
యాక్షన్ ఎడ్వంచర్ చిత్రాలకు పెట్టింది పేరైన హాలీవుడ్ చిత్ర సీమ నుంచి మరో భారీ యాక్షన్ ఎడ్వంచర్ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గతం వచ్చిన డైహార్డ్ చిత్రం 4 సిరీస్‌లు మంచి విజయం సాధించిన నేపథ్యంలో తాజాగా 5వ భాగాన్ని 'ఎ గుడ్ డే టు డై హార్డ్' అనే పేరుతో రూపొందించారు. ఈచిత్రం అమెరికా, కెనడాల్లో ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఈ నెలాఖరుకు ఈ సినిమాను ఇండియాలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.తెలుగులో ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే : స్కిప్ వుడ్స్, సంగీతం : మాక్కో బెల్ట్రామి, సినిమాటోగ్రఫీ : జొనాథన్ సేలా, నిర్మాతలు : అలెక్స్ యంగ్, పీటెర్ వెవెర్కా, దర్శకత్వం : జాన్ మూర్.


Click it and Unblock the Notifications











