TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
కించ పరుస్తూ సినిమా... దర్శకుడికి ఏడాది జైలు
లాస్ ఏంజిల్స్: వివాదాస్పద ఇస్లాం వ్యతిరేక చిత్రం 'ఇన్నోసెన్స్ ఆఫ్ ముస్లిం'పై ప్రపంచంలోని ఇస్లాం లోకం మొత్తం భగ్గమన్న సంగతి తెలిసిందే. తాజా ఆ చిత్ర దర్శకుడు నకోలా బాసెల్లే(మార్క్ బాసిల్లే యూసఫ్) కు అమెరికా కోర్టు సంవత్సరం జైలు శిక్ష విధించి కాగారానికి పంపించింది.
ఈజిప్టియన్-అమెరికన్ అయిన నకోలా బాసెల్లే 2009లో ఓ చెక్ ఫ్రాడ్ కేసులో దోషిగా తేలడంతో కోర్టు అతనికి 21 నెలల జైలు శిక్ష విధించింది. అదే విధంగా కోర్టు అనుమతి లేకుండా కంప్యూటర్ గానీ, ఇంటర్నెట్ గానీ వాడకూడదని సూచించింది. అయితే ఫెడరల్ ప్యాసిక్యూటర్లు అతను అనేక మారు పేర్లు ఉపయోగించి కంప్యూటర్ వాడినట్లు గుర్తించారు.
ఈ సంవత్సరం జులైలో 13 నిమిషాల నిడివిగల 'ఇన్నోసెన్స్ ఆఫ్ ముస్లిం' ట్రైలర్ ను యూట్యూబ్ లో అప్ లోడ్ చేసాడు. కోర్టు ధిక్కారంతో పాటు సదరు ట్రైలర్ పోస్టు చేసి హింసక కారణమైనందుకు గాను అతనికి సంవత్సరం జైలు శిక్ష విధించారు. 'ఇన్నోసెన్స్ ఆఫ్ ముస్లిం' మూవీపై ముస్లిం దేశాల్లో ఆందోళన కార్యక్రమాలు చెలరేగడంతో పాటు అమెరికా రాయబార కార్యాలయాలపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే.
ఈచిత్రంలో నటించిన వారు ఇప్పుడు అర చేతిలో ప్రాణాలు పట్టుకుని బిక్కుబిక్కుమనే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితులకు కారణం మహ్మద్ ప్రవక్తను కించపరుస్తూ ఈ సినిమా ఉండటమే. ఈచిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన నటి అనాగుర్జీ తను ప్రాణభయంతో గడుపుతున్నానని 'డెయిలీ మెయిల్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాపోయింది.