Don't Miss!
- News ఇంటర్ కళాశాలకు వేసవి సెలవులు...ఎప్పటినుంచంటే..?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్‌పై వేటు.. గుజరాత్‌తో తలపడే సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్‌ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్‌ఫోన్..!!
జేమ్స్‌బాండ్‌ను చంపేయడమా? నేను ఒప్పుకోను.. గుడ్‌బై చెప్పిన డైరెక్టర్
జేమ్స్‌బాండ్ సినిమా అంటే ఊహించని ట్విస్టులు, టర్నింగ్‌లు ఉంటాయి. ప్రేక్షకుడి అంచనాలకు అందని విధంగా యాక్షన్ సీన్లు ఉంటాయి. జేమ్స్‌బాండ్ నుంచి అలాంటి యాక్షన్ సీన్లు లేకపోతే అభిమానులు ఊరుకొంటారా? అసలు బాండ్ ఇక ఉండడు అంటే ఒప్పుకొంటారా? అనే ప్రశ్నలు ఊహించుకోవడానికే వశపడదు. ఎన్నో ఏళ్ల నుంచి ప్రేక్షకులను ఊర్రూతలూగించిన జేమ్స్‌బాండ్ పాత్రను చంపేయాని నిర్ణయం తీసుకొన్న నిర్మాతకు దర్శకుడు ఝలక్ ఇచ్చి సినిమా నుంచి తప్పుకోవడం ప్రపంచవ్యాప్తంగా సెన్సేషనల్‌గా మారింది.
25వ జేమ్స్ బాండ్ సినిమా
డానీ బోయ్లే దర్శకత్వంలో జేమ్స్‌బాండ్ సిరీస్‌లో 25వ సినిమాను తెరకెక్కించాలనే ప్రయత్నం చేశారు. గతంలో కాసినో రాయల్, స్కైఫాల్, స్పెక్ట్రర్ చిత్రాల్లో నటించిన డేనియల్ క్రేగ్ హీరోగా అనుకొన్నారు. దాంతో ఆ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తప్పుకొన్న డైరెకర్ట్ డానీ బోయ్లే
బాండ్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు అంతా సవ్యంగా జరుగుతున్నదనుకొనే లోపే దర్శకుడు డానీ బోయ్లే సినిమాకు దర్శకత్వం వహించనని తప్పుకొన్నాడు. అందుకు కారణం ప్రేక్షకులు జీర్ణించుకోలేని విధంగా జేమ్స్‌బాండ్‌ను ఆ సినిమాలో చంపేయడమే.
ఆ పాపాన్ని నేను మోయలేను
జేమ్స్ బాండ్ అంటే ప్రేక్షకుడి భావోద్వేగానికి సంబంధించింది. బాండ్ పాత్రను చంపేసి ఆ పాపాన్ని నేను మూటగట్టుకోలేను. ఆ ఆలోచనే చాలా దారుణం. అందుకే ఈ కథను నేను తెరకెక్కించలేను అంటూ డానీ బోయ్లే ఆ సినిమా నుంచి తప్పుకొన్నట్టు తెలిసింది.
క్రియేటివ్ విభేదాలు
జేమ్స్‌బాండ్ పాత్రను చంపే విషయంలో దర్శక బోయ్లే, నిర్మాత బార్పారా బ్రకోలి, స్టోరి టీమ్ మధ్య క్రియేటివ్ విభేదాలు వచ్చాయి. డేనియల్ క్రేగ్ కూడా బాండ్ పాత్రను చంపేద్దామని ఒప్పుకొన్నారనే వార్త ప్రచారంలో ఉంది.