twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జేమ్స్‌బాండ్‌ను చంపేయడమా? నేను ఒప్పుకోను.. గుడ్‌బై చెప్పిన డైరెక్టర్

    By Rajababu
    |

    జేమ్స్‌బాండ్ సినిమా అంటే ఊహించని ట్విస్టులు, టర్నింగ్‌లు ఉంటాయి. ప్రేక్షకుడి అంచనాలకు అందని విధంగా యాక్షన్ సీన్లు ఉంటాయి. జేమ్స్‌బాండ్ నుంచి అలాంటి యాక్షన్ సీన్లు లేకపోతే అభిమానులు ఊరుకొంటారా? అసలు బాండ్ ఇక ఉండడు అంటే ఒప్పుకొంటారా? అనే ప్రశ్నలు ఊహించుకోవడానికే వశపడదు. ఎన్నో ఏళ్ల నుంచి ప్రేక్షకులను ఊర్రూతలూగించిన జేమ్స్‌బాండ్ పాత్రను చంపేయాని నిర్ణయం తీసుకొన్న నిర్మాతకు దర్శకుడు ఝలక్ ఇచ్చి సినిమా నుంచి తప్పుకోవడం ప్రపంచవ్యాప్తంగా సెన్సేషనల్‌గా మారింది.

    25వ జేమ్స్ బాండ్ సినిమా

    25వ జేమ్స్ బాండ్ సినిమా

    డానీ బోయ్‌లే దర్శకత్వంలో జేమ్స్‌బాండ్ సిరీస్‌లో 25వ సినిమాను తెరకెక్కించాలనే ప్రయత్నం చేశారు. గతంలో కాసినో రాయల్, స్కైఫాల్, స్పెక్ట్రర్ చిత్రాల్లో నటించిన డేనియల్ క్రేగ్ హీరోగా అనుకొన్నారు. దాంతో ఆ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

    తప్పుకొన్న డైరెకర్ట్ డానీ బోయ్‌లే

    తప్పుకొన్న డైరెకర్ట్ డానీ బోయ్‌లే

    బాండ్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు అంతా సవ్యంగా జరుగుతున్నదనుకొనే లోపే దర్శకుడు డానీ బోయ్‌లే సినిమాకు దర్శకత్వం వహించనని తప్పుకొన్నాడు. అందుకు కారణం ప్రేక్షకులు జీర్ణించుకోలేని విధంగా జేమ్స్‌బాండ్‌ను ఆ సినిమాలో చంపేయడమే.

    ఆ పాపాన్ని నేను మోయలేను

    ఆ పాపాన్ని నేను మోయలేను

    జేమ్స్ బాండ్ అంటే ప్రేక్షకుడి భావోద్వేగానికి సంబంధించింది. బాండ్‌ పాత్రను చంపేసి ఆ పాపాన్ని నేను మూటగట్టుకోలేను. ఆ ఆలోచనే చాలా దారుణం. అందుకే ఈ కథను నేను తెరకెక్కించలేను అంటూ డానీ బోయ్‌లే ఆ సినిమా నుంచి తప్పుకొన్నట్టు తెలిసింది.

     క్రియేటివ్ విభేదాలు

    క్రియేటివ్ విభేదాలు

    జేమ్స్‌బాండ్ పాత్రను చంపే విషయంలో దర్శక బోయ్‌లే, నిర్మాత బార్పారా బ్రకోలి, స్టోరి టీమ్ మధ్య క్రియేటివ్ విభేదాలు వచ్చాయి. డేనియల్ క్రేగ్ కూడా బాండ్ పాత్రను చంపేద్దామని ఒప్పుకొన్నారనే వార్త ప్రచారంలో ఉంది.

    English summary
    James Bond director Danny Boyle quit the James Bond franchise earlier this week. A recent report said that Craig and producer Barbara Broccoli wanted Bond to die in a spectacular finale. Oscar-winning director Boyle flatly refused to kill off the secret agent in the 25th film and called the idea ridiculous.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X