»   » ఆ టాప్ డైరెక్టర్, టాప్ హీరో నన్ను రేప్ చేశారు: హీరోయిన్ సంచలన ఆరోపణ

ఆ టాప్ డైరెక్టర్, టాప్ హీరో నన్ను రేప్ చేశారు: హీరోయిన్ సంచలన ఆరోపణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

సౌత్ కొరియాకు చెందిన ఓ హీరోయిన్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ కిమ్ కి డుక్, టాప్ హీరో చో జే-హున్ మీద సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఇద్దరూ తనపై అత్యాచారం చేశారని, తనపై లైంగిక దాడి జరిపారని వెల్లడించారు. ఓ వైపు #MeToo ఉద్యమం జోరుగా సాగుతున్న నేపథ్యంలో సదరు హీరోయిన్ తాను ఎదుర్కొన్న సంఘటన గురించి ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో తెలిపారు.

పేరు చెప్పడానికి ఇష్టపడని హీరోయిన్

పేరు చెప్పడానికి ఇష్టపడని హీరోయిన్

ఓ టీవీ ఇంటర్వ్యూలో కిమ్ కి డుక్ మీద ఆరోపణలు చేసిన సదరు హీరోయిన్ తన పేరును బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. ఓ రిమోట్ ఏరియాలో షూటింగ్ జరుగుతున్న సమయంలో రాత్రి పూట తన గదిలోకి రావడానికి దర్శకుడు ప్రయత్నించేవాడని ఆమె పేర్కొన్నారు.

నరకం అనుభవించాను

నరకం అనుభవించాను

విలేజ్‌లో షూటింగ్ జరిగినంత కాలం తాను నరకం అనుభవించాను. నా గది వద్దకు వచ్చి డోర్ కొడుతూ ఉండేవాడు, లేదంటే తాను రెస్పాండ్ అయ్యే వరకు ఫోన్ చేస్తూ ఉండేవాడు.... అని ఆమె టీవీ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

 కథ గురించి మాట్లాడుదామని పిలిచి రేప్ చేశాడు

కథ గురించి మాట్లాడుదామని పిలిచి రేప్ చేశాడు

ఓసారి కిమ్ స్క్రిప్టు గురించి చర్చిద్దామని చెప్పి నన్ను తన గదికి పిలిపించుకున్నాడు. నేను వెళ్లగానే నాపై అత్యాచారం చేశాడు అని సదరు హీరోయిన్ ఆరోపించారు.

ఆ టాప్ హీరో కూడా అత్యాచారం చేశాడు

ఆ టాప్ హీరో కూడా అత్యాచారం చేశాడు

కిమ్ కి డుక్ దర్శకత్వంలో తాను నటిస్తున్న సయంలో ఈ సంఘటన చోటు చేసుకుందని, ఈ చిత్రంలో హీరోగా నటించిన చో జే-హున్ కూడా తనపై అత్యాచారం చేశాడని సదరు హీరోయిన్ వెల్లడించారు.

 కొంతకాలం నటన ఆపేశాను

కొంతకాలం నటన ఆపేశాను

ఆ సంఘటనతో కొంతకాలం నటన ఆపేసి ఆ సంఘటను సంబంధించిన చేదు జ్ఞాపకాల నుండి బయట పడటానికి కొన్ని సంవత్సరాల పాటు థెరపీ తీసుకున్నట్లు వెల్లడించారు.

 ఈ డైరెక్టర్ మామూలోడు కాదు

ఈ డైరెక్టర్ మామూలోడు కాదు

కిమ్ కి డుక్ బెర్లిన్, కేన్స్, వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో పలు అవార్డులు దక్కించుకున్నాడు. అయితే ఇతడి వద్ద కాస్త రాక్షస గుణం కూడా ఉంది. సెట్స్‌లో ఓ నటిని శారీరకంగా హింసిచినందుకు ఫైన్ కూడా ($4,600) కట్టాడు.

సమ్మతమైన లైంగిక సంబంధాల్లో మాత్రమే పాల్గొన్నానంటున్న కిమ్

సమ్మతమైన లైంగిక సంబంధాల్లో మాత్రమే పాల్గొన్నానంటున్న కిమ్

కిమ్ తనపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో సదరు టీవీ చానల్‌కు సందేశం పంపారు. "సమ్మతమైన లైంగిక సంబంధాల్లో మాత్రమే తాను పాల్గొన్నాను' అని వెల్లడించారు. "చిత్ర దర్శకుడిగా నా హోదాను ఉపయోగించి నా వ్యక్తిగత కోరికలను సంతృప్తి పరచడానికి నేను ఎప్పుడూ ప్రయత్నించలేదు," అన్నారు.

 నేను పాపిని..

నేను పాపిని..

చో జే-హున్ తనపై వస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ.... విచారణ మొదలైతే తనపై వస్తున్న ఆరోపణలపై స్పందిస్తాను అని వెల్లడించారు. ఈ వార్తలు నన్ను ఎంతో బాధించాయి అని తెలిపారు. "నేను పాపిని. కానీ వార్తల్లో నేను చూసే అనేక విషయాలు నిజం నుండి భిన్నంగా ఉంటాయి. "

English summary
A South Korean female actor has accused award-winning film director Kim Ki-duk and a top actor of rape, as the country’s nascent #MeToo movement begins to spiral.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu